E-Paper
Advertisement

మీ పాత ఫోన్‌ను.. సూపర్ ఫాస్ట్‌గా మార్చేసే.. అద్భుతమైన ‘స్మార్ట్’ చిట్కాలు!

మీ పాత ఫోన్‌ను.. సూపర్ ఫాస్ట్‌గా మార్చేసే.. అద్భుతమైన ‘స్మార్ట్’ చిట్కాలు!
Advertisement

Smartphone Tips: సాధారణంగా ఫోన్ కొన్న కొత్తలో అది ఎంత వేగంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే రాను రాను.. దాని వేగం తగ్గిపోవడం చాలా మందిని వేధిస్తుంటుంది. లక్షలు పోసి కొన్నా.. వేలు పెట్టి కొన్నా.. కొద్దిరోజుల్లో ఫోన్ హ్యాంగ్ అవుతూ పాతదానిలా చికాకు తెప్పిస్తుంటుంది. అయితే కొన్ని స్మార్ట్ ట్రిక్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఉపయోగించి.. పాత ఫోన్‌ను కూడా సరికొత్త ఫోన్ లాగా మార్చుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ స్మార్ట్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్టోరేజ్ క్లీనింగ్..

ఫోన్ స్లో అవ్వడానికి ప్రధాన కారణం నిండిపోయిన స్టోరేజ్. మనం వాడని యాప్స్, ఎప్పుడో డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ ఫోన్ మెమరీని తినేస్తుంటాయి. కాబట్టి వారానికి ఒకసారి ఫోన్ స్టోరేజ్ చెక్ చేసుకొని.. వాడని యాప్స్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వాట్సాప్ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు, డూప్లికేట్ ఫోటోలను డిలీట్ చేయడానికి ‘ఫైల్స్ బై గూగుల్’ (Files by Google) లాంటి యాప్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. స్టోరేజ్ కనీసం 20% ఖాళీగా ఉంటే ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

బ్యాటరీకి ’65-80′ రూల్

Advertisement

చాలామంది ఫోన్ బ్యాటరీ 0% కి పడిపోయే వరకు వాడతారు. లేదంటే రాత్రంతా ఛార్జింగ్‌లోనే వదిలేసి 100 శాతం నింపుతారు. ఇవి రెండూ బ్యాటరీ లైఫ్‌ను దారుణంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ బ్యాటరీని ఎప్పుడూ 20 శాతం కంటే తగ్గనివ్వద్దని సూచిస్తున్నారు. అలాగే 80% నుండి 90 శాతం రాగానే ఛార్జింగ్ ఆపేయాలని హితవు పలుకుతున్నారు. నెలకోసారి మాత్రమే 100 శాతం ఛార్జ్ చేయాలని.. దీనివల్ల బ్యాటరీ హెల్త్ ఏళ్ల తరబడి పాడవకుండా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌

ఫోన్‌లో అప్‌డేట్ నోటిఫికేషన్ రాగానే చాలామంది ‘Later’ అని నొక్కేస్తుంటారు. కానీ ఫోన్ కొత్తగా పనిచేయాలంటే అప్‌డేట్స్ చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. కంపెనీలు ఇచ్చే ప్రతి సెక్యూరిటీ ప్యాచ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇవి ఫోన్‌లోని బగ్స్‌ను క్లియర్ చేసి స్పీడ్‌ను పెంచుతాయని వివరిస్తున్నారు.

‘రీస్టార్ట్’ మంత్రం

Advertisement

కంప్యూటర్ లాగే మొబైల్‌కు కూడా కాస్త విశ్రాంతి అవసరం. రోజుల తరబడి ఫోన్ ఆన్ చేసి ఉంచడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరమైన ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా ఫోన్‌ను రీస్టార్ట్ (Restart) చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ర్యామ్ క్లియర్ అయి.. ఫోన్ సరికొత్తగా రన్ అవ్వడం ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నారు.

క్యాచీ డేటాను క్లియర్

రోజూ వాడే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, బ్రౌజర్లు భారీగా ‘క్యాచీ డేటా’ను నిల్వ చేసుకుంటాయి. ఇవి ఫోన్ వేగాన్ని తగ్గించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ మేనేజర్‌లో తరచూ వాడే యాప్స్ కు సంబంధించి ‘Clear Cache’ బటన్ నొక్కాలని సూచిస్తున్నారు. అయితే అక్కడే ఉండే ‘Clear Data’ నొక్కితే లాగిన్ వివరాలు పోతాయి కాబట్టి కేవలం క్లియర్ క్యాచీ మాత్రమే చేయడం బెటర్.

Also Read: ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. బట్టలు బాగా ఉతికేది ఏది? ఇంటికి ఏ వాషింగ్ మిషన్ బెస్ట్?

వేడికి దూరంగా ఉంచడం

స్మార్ట్‌ఫోన్‌కు అతిపెద్ద శత్రువు ‘వేడి’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్ ఎక్కువగా హీట్ అయితే ప్రాసెసర్, బ్యాటరీ రెండు త్వరగా పాడైపోతాయని పేర్కొంటున్నారు. కాబట్టి ఎండలో బైక్ నడిపేటప్పుడు మొబైల్ హోల్డర్స్‌లో ఫోన్ పెట్టడం, ఛార్జింగ్ అవుతున్నప్పుడు హెవీ గేమ్స్ ఆడటం లాంటివి చేయవద్దని సూచిస్తున్నారు. ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే కాసేపు పక్కన పెట్టేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. మెుత్తంగా కొత్త ఫోన్ కొనడం కంటే ఉన్న ఫోన్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడం స్మార్ట్ పద్దతి అని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: పాక్ సంచలన నిర్ణయం.. లాహోర్ వీధుల్లో హిందూ పేర్లు.. అసలేం జరుగుతోంది?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×