E-Paper
Advertisement

ఫోన్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయకపోతే.. సర్వస్వం ఊడ్చేస్తారు!

ఫోన్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయకపోతే.. సర్వస్వం ఊడ్చేస్తారు!
Advertisement

Phone Hacking: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీంతో అంతే వేగంగా మొబైల్ హ్యాకింగ్ ముప్పు కూడా పెరుగుతూ వస్తోంది. ఒకవేళ మీ ఫోన్ కూడా హ్యాక్ అయిందని అనుమానం వస్తే అస్సలు కంగారుపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పర్సనల్ డేటా హ్యాకర్ల బారిన పడకుండా భద్రంగా ఉంచేందుకు తక్షణం చేయాల్సిన 5 స్మార్ట్ పనులను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హ్యాకింగ్‌ను ఎలా గుర్తించాలి?

ఒక్కోసారి మెుబైల్ ఎవరి ప్రమేయం లేకుండానే దానంతట అదే వర్క్ చేస్తూ ఉంటుంది. మొబైల్ స్క్రీన్ ఆటోమేటిక్‌గా బ్లింక్ అవ్వడం, బ్యాటరీ వేగంగా అయిపోవడం, దానంతట అవే యాప్స్ ఓపెన్ కావడం వంటివి జరిగితే ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు భావించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో సమయం వృథా చేయకుండా ఐదు పనులు వెంటనే చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇంటర్నెట్ కనెక్షన్‌ కట్

Advertisement

ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వచ్చిన వెంటనే ముందుగా ఫోన్ వైఫై, మెుబైల్ డేటాను ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే ఫోన్‌ను ‘ఫ్లైట్ మోడ్’ (Flight Mode) లో పెట్టడం మంచిదని హితవు పలుకుతున్నారు. సాధారణంగా హ్యాకర్లు ఫోన్ నుండి డేటాను దొంగిలించాలన్నా లేదా మెుబైల్ ను కంట్రోల్ చేయాలన్నా ఇంటర్నెట్ అవసరం. కనెక్షన్ కట్ చేయడం ద్వారా వారి యాక్సెస్‌ను అడ్డుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

అనుమానాస్పద యాప్స్ డిలీట్

ఇంటర్నెట్ ఆపేసిన తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ లిస్ట్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌స్టాల్ చేయని కొత్త యాప్‌లు లేదా మాల్వేర్ (Malware) లాంటివి ఏవైనా కనిపిస్తే వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని సోర్సెస్ నుండి డౌన్‌లోడ్ అయిన ‘APK’ ఫైళ్లను వెతికి మరీ డిలీట్ చేయాలని స్పష్టం చేస్తున్నారు.

పాస్‌వర్డ్‌లను మార్చండి

Advertisement

హ్యాకర్లు ప్రధానంగా బ్యాంక్ ఖాతాలు, ఈమెయిల్, సోషల్ మీడియా అకౌంట్లను టార్గెట్ చేస్తుంటారు. కాబట్టి ఫోన్ లేదా లాప్‌టాప్ ఉపయోగించి గూగుల్, బ్యాంకింగ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ముఖ్యమైన అకౌంట్ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అన్ని అకౌంట్లకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు.

బ్యాంక్ ఖాతాలు బ్లాక్ చేయండి

ఫోన్‌లో గూగుల్ పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్ యాప్స్ ఉండి.. ఆర్థిక డేటా ప్రమాదంలో పడిందని అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఖాతాలను, క్రెడిట్/డెబిట్ కార్డులను తాత్కాలికంగా బ్లాక్ చేయమని చెప్పాలని స్పష్టం చేస్తున్నారు. ఇది మీ డబ్బు హ్యాకర్ల బారిన పడకుండా కాపాడుతుందని తెలియజేస్తున్నారు.

Also Read: ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. ఈ 5 యాప్స్ ఉంటే చాలు!

ఫ్యాక్టరీ రీసెట్

పైన పేర్కొన్న పద్దతులు ఫాలో అయినా వైరస్ పోలేదని భావిస్తే.. ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయడం బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఫోన్ లోని డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఫోన్ కొత్తదానిలా మారుతుందని పేర్కొంటున్నారు. లోపల దాగి ఉన్న హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ లేదా వైరస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని స్పష్టం చేస్తున్నారు. మెుత్తంగా ఈ ఐదు స్టెప్స్ పాటిస్తే.. విలువైన సమాచారాన్ని, డబ్బును సురక్షితంగా కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు.

Also Read: ఆఫీస్ vs వర్క్ ఫ్రమ్ హోమ్.. డబ్బు ఆదాకు ఏది బెస్ట్? ChatGPT షాకింగ్ రిపోర్ట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×