E-Paper
Advertisement

Mobile Radiation Tips: ఫోన్ ఏ చేవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే బెటర్? కుడి లేదా ఎడమ?

Mobile Radiation Tips: ఫోన్ ఏ చేవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే బెటర్? కుడి లేదా ఎడమ?
Advertisement

Mobile Radiation Tips: ఈ మధ్య వాట్సప్‌లో ఓ ఫార్వర్డ్ మెసేజ్ మనుషులను తెగ కంగారు పెట్టేస్తుంది. అదేంటంటే.. ఫోన్ ఎప్పుడూ ఎడమ చెవి దగ్గరే పెట్టుకుని మాట్లాడండి, కుడి చెవి దగ్గర పెట్టుకుంటే రేడియేషన్ నేరుగా మెదడుకు తగిలి డేంజర్ అవుతుంది అని. ఈ మెసేజ్ చూసి చాలామంది నిజమేనేమో అని భయపడి, కష్టమైనా సరే ఎడమ చేత్తోనే ఫోన్ పట్టుకుని మాట్లాడుతుంటారు. మరి ఇందులో నిజమెంత? సైన్స్ ఏం చెబుతోంది? రేడియేషన్ తగ్గించుకోవాలంటే మనమేం చేయాలి.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిజంగా ఎడమ వైపు సేఫా?

ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం.. ఫోన్ ఏ చెవి దగ్గర పెట్టుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. మన రెండు చెవుల నిర్మాణం దాదాపు ఒకేలా ఉంటుంది. రేడియేషన్ అనేది మీరు ఫోన్ ఎటువైపు పట్టుకుంటే అటువైపు కొంచెం ప్రభావం చూపుతుంది తప్ప, కుడికి ఒకలా ఎడమకి ఒకలా ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లాంటి పెద్ద సంస్థలు కూడా ‘ఏ చెవి అన్నది ముఖ్యం కాదు, ఫోన్‌ని తలకు ఎంత దూరంగా ఉంచామన్నదే ముఖ్యం’ అని చెబుతున్నాయి. కాబట్టి ఎడమ చెవి మాత్రమే సేఫ్ అనేది కేవలం ఒక ప్రచారం మాత్రమే.

ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయంటే?

Advertisement

మనలో చాలామందికి కుడి చేత్తో పని చేయడం అలవాటు. అలాగే మన మెదడులోని ఎడమ భాగం భాషను, మాటలను కంట్రోల్ చేస్తుంది. అందుకే మనకు తెలియకుండానే కుడి చెవి వైపు ఫోన్ పెట్టుకోవడానికి ఇష్టపడతాం. ఇదొక అలవాటు మాత్రమే. ఈ విషయాన్ని అమెరికాలోని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ వారు చేసిన రీసెర్చ్‌లో కూడా తేల్చారు. కాబట్టి వాట్సాప్‌లో వచ్చే ఆ మెసేజ్‌లు చూసి కంగారు పడాల్సిన పనిలేదు.

Also Read: సాగదీస్తే ట్యాబ్లెట్, మడతపెడితే ఫోన్.. శాంసంగ్ జెడ్ ట్రైఫోల్డ్ 2 లాంచ్ డేట్ ఫిక్స్!

రేడియేషన్ ఎప్పుడు పెరుగుతుంది?

Advertisement

ఫోన్‌ని ఏ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాం కానీ, అసలు రేడియేషన్ ఎప్పుడు ఎక్కువగా వస్తుందో పట్టించుకోవట్లేదు. మీ ఫోన్‌లో సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు (ఒక్క పాయింట్ మాత్రమే ఉన్నప్పుడు) ఫోన్ టవర్‌ని అందుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఆ సమయంలో అది మామూలు కంటే వేల రెట్లు ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. అలాగే లిఫ్టుల్లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు సిగ్నల్ హెచ్చుతగ్గులు ఉంటుంది కాబట్టి.. అప్పుడు కూడా రేడియేషన్ ఎక్కువే.

మనమేం చేయాలి?

రేడియేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. వీలైనంత వరకు హెడ్‌సెట్ లేదా స్పీకర్ ఫోన్ వాడటం అన్నిటికంటే బెస్ట్. ఒకవేళ ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవాల్సి వస్తే, గంటల కొద్దీ మాట్లాడకుండా మధ్యలో అటూ ఇటూ మార్చాలి. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని తల పక్కన పెట్టుకోకుండా కొంచెం దూరంగా ఉంచండి. ఫోన్ వాడకం తగ్గించడం, మంచి సిగ్నల్ ఉన్నప్పుడు మాట్లాడటం అనేవి ఏ చెవి దగ్గర పెట్టుకోవాలి అనే దానికంటే చాలా ముఖ్యం. మన ఫోన్ బాక్స్‌పై లేదా సెట్టింగ్స్‌లో SAR వ్యాల్యూ అని ఉంటుంది. అది 1.6 కంటే తక్కువ ఉంటే మీ ఫోన్ సేఫ్ అని అర్థం.

Also Read: 54 గంటల బ్యాటరీ, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌తో వన్‌ప్లస్ న్యూ బడ్స్ లాంచ్.. ధర కూడా తక్కువే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×