E-Paper
Advertisement

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!
Advertisement

Email Assistant: ప్రతిరోజూ మన ఫోన్లోకి చాలా ఇ-మెయిల్స్ వస్తుంటాయి. ఆఫీస్ వర్క్‌ అయినా.. బిజినెస్‌కు సంబంధించిన ఇ-మెయిల్స్ అయినా కొన్నిటికి కచ్చితంగా రిప్లై ఇవ్వాల్సిందే. అలా మీరు కూడా రోజంతా ఇ-మెయిల్స్‌కు రిప్లై ఇస్తూ సమయం వృథా చేసుకుంటున్నారా? అయితే, మీ కోసమే ఈ సరికొత్త ఏఐ టూల్. ఈ టూల్ మీ ఇ-మెయిల్‌ను మీలాగే రాసి.. మీ పనిని సులభతరం చేస్తుంది. దానికోసమే Perplexity ఈ కొత్త ఇ-మెయిల్‌ అసిస్టెంట్‌ని తీసుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం వారికి మాత్రమే:

Perplexity తీసుకొచ్చిన ఈ సరికొత్త ఏఐ టూల్‌ యూజర్లు తమ ఇ-మెయిల్‌ బాక్స్‌ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి, డ్రాఫ్ట్‌ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఏఐ టూల్ ప్రస్తుతం Perplexity Max సబ్‌స్ర్కైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మిగతా వారికి కూడా అందుబాటులోకి తేవచ్చు.

మీ పర్సనల్ సెక్రటరీగా:

Advertisement

ఇ-మెయిల్స్‌కు పర్సనల్ సెక్రటరీగా వచ్చిన ఈ కొత్త ఏఐ టూల్.. ప్రస్తుతం Gmail, Outlook లాంటి ప్రముఖ ఇ-మెయిల్‌ సర్వీసులతో సింక్‌ అయ్యి పనిచేస్తుంది. ఈ అసిస్టెంట్‌ కేవలం ఆటోమేటిక్‌ రిైప్లెలను మాత్రమే కాకుండా.. వినియోగదారుడి సంభాషణ శైలిని, టోన్‌ను నేర్చుకుంటుంది. అంటే.. మీ వ్యక్తిగత స్టైల్లోనే పర్సనలైజ్డ్‌ రిైప్లెలు తయారుచేస్తుందన్న మాట.

యూజర్ల భద్రతకు ప్రాధాన్యం:

మీకొచ్చే ఇ-మెయిల్స్ ఆధారంగా.. మీ షెడ్యూల్‌కు సరిపోయే మీటింగ్‌ టైమింగ్స్‌ను సూచిస్తుంది. ఈ అసిస్టెంట్ యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దీన్ని వాడటం చాలా సులభం. మీ రిజిస్టర్డ్‌ ఇ-మెయిల్‌ ఖాతా నుంచి assistant@perplexity.comకు జస్ట్ ఒక మెయిల్‌ చేస్తే చాలు. టూల్‌ లింక్‌ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.

ప్రశ్నలు కూడా అడగవచ్చు:

Advertisement

ఇది మీకొచ్చే ముఖ్యమైన మెయిల్స్‌ను ముందుగా చూపిస్తుంది. గ్రూప్‌ మెయిల్స్‌ను ఆర్గనైజ్‌ చేస్తుంది. అంతేకాదు, ఈ అసిస్టెంట్‌ను మీ ఇన్‌బాక్స్‌ గురించి కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఉదా: బోర్డు మీటింగ్‌ ముందు నేను ఏ మెయిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి? అని అడిగారనుకోండి.. క్షణాల్లోనే ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి మీ ముందు ఉంచుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×