E-Paper
Advertisement

బ్యాంక్ అకౌంట్‌తో పనిలేదిక.. టీనేజర్స్ కోసం టాప్-8 సూపర్ డిజిటల్ పాకెట్ మనీ యాప్స్ ఇవే!

బ్యాంక్ అకౌంట్‌తో పనిలేదిక.. టీనేజర్స్ కోసం టాప్-8 సూపర్ డిజిటల్ పాకెట్ మనీ యాప్స్ ఇవే!
Advertisement

Teenager UPI Apps: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆన్‌లైన్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, 18 ఏళ్ల లోపు పిల్లలకు సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఉండదు కాబట్టి.. వారు డిజిటల్ లావాదేవీలు చేయడం కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థలు టీనేజర్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా పేటీఎం తాజాగా ప్రవేశపెట్టిన ‘పాకెట్ మనీ’ ఫీచర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది యూపీఐ సర్కిల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది. దీంతో తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు సురక్షితంగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇలాంటి సేవలను అందిస్తున్న మరికొన్ని అద్భుతమైన యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Paytm Pocket Money

పేటీఎం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ టీనేజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం పిల్లలకు విడిగా బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. తల్లిదండ్రులు తమ అకౌంట్ నుంచే కొంత మొత్తాన్ని కేటాయించి, పిల్లల ఖర్చులను నియంత్రించవచ్చు. స్కూల్ ఫీజులు, స్నాక్స్ లేదా ప్రయాణ ఖర్చుల కోసం పిల్లలు దీని ద్వారా సులభంగా పేమెంట్స్ చేయవచ్చు.

FamApp

Advertisement

గతంలో ఫామ్‌పేగా పిలవబడే ఈ యాప్ టీనేజర్లకు ఉపయోగపడే విషయంలో చాలా ఫేమస్. ఇది కేవలం పేమెంట్స్ కోసమే కాకుండా.. పిల్లల కోసం ప్రత్యేకమైన ప్రీపెయిడ్ కార్డులను కూడా అందిస్తుంది. తల్లిదండ్రుల నిఘా ఉంటూనే పిల్లలు తమ సొంత డబ్బును మేనేజ్ చేసుకోవడం ఇందులో నేర్చుకోవచ్చు. రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Junio

డిజిటల్ పాకెట్ మనీ యాప్‌గా గుర్తింపు పొందిన జూనియో ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన డబ్బును లోడ్ చేయవచ్చు. రోజువారీ ఖర్చులకు పరిమితులు విధించే అవకాశం ఉండటంతో పిల్లలు డబ్బును వృథా చేయకుండా జాగ్రత్త పడతారు. ఆన్‌లైన్ షాపింగ్ కోసం కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

Walrus

Advertisement

ముఖ్యంగా స్టూడెంట్స్, జెడ్‌జెన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాల్‌రస్ యాప్ రూపొందించబడింది. ఇది టీనేజర్లకు ప్రీపెయిడ్ కార్డ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. బ్యాంక్ ఖాతాతో పనిలేకుండానే డిజిటల్ పేమెంట్స్ చేసే వెసులుబాటు కల్పించడంతో పాటు, మనీ మేనేజ్‌మెంట్ పట్ల అవగాహన కల్పిస్తుంది.

Also Read: 21 రోజుల బ్యాటరీ లైఫ్.. గేమింగ్ మోడ్‌తో షావోమి కొత్త స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడేవాళ్లకి పండగే!

Akudo

ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం అకుడో ప్రధాన లక్ష్యం. పిల్లలు డబ్బును ఎలా పొదుపు చేయాలో నేర్పేందుకు దీనిలో గేమిఫైడ్ టూల్స్ ఉంటాయి. ఖర్చులను ట్రాక్ చేస్తూనే.. బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలో ఈ యాప్ ద్వారా పిల్లలు ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు.

GoHenry

ఇది అంతర్జాతీయంగా పేరుపొందిన యాప్. పిల్లలకు ఇంటి పనులు కేటాయించడం, అవి పూర్తి చేశాక వారికి మనీ ఇవ్వడం వంటి ఆసక్తికరమైన ఫీచర్లు దీనిలో ఉన్నాయి. పొదుపు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడానికి ఇది ఉపయోగకరం.

Greenlight

టీనేజర్ల కోసం డెబిట్ కార్డ్ సేవలను అందించడమే కాకుండా.. పెట్టుబడుల గురించి కూడా గ్రీన్ లైట్ అవగాహన కల్పిస్తుంది. చిన్న వయసు నుంచే స్టాక్స్ మరియు సేవింగ్స్ పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు ఇది ఒక చక్కని లెర్నింగ్ టూల్‌లా పనిచేస్తుంది.

Step

అమెరికా కేంద్రంగా పనిచేసే స్టెప్ యాప్, టీనేజర్లకు బ్యాంకింగ్ అనుభవాన్ని ముందే పరిచయం చేస్తుంది. సురక్షితమైన స్పెండింగ్ అకౌంట్ ద్వారా పిల్లలు తమ పేమెంట్స్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో క్రెడిట్ హిస్టరీ నిర్మించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ యాప్స్ కేవలం పేమెంట్స్ కోసమే కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పడానికి ఉపయోగపడుతున్నాయి.

Also Read: తిరుగులేని ఫీచర్లతో iQOO Pad 6 Pro లాంచ్.. ల్యాప్‌టాప్‌కు పోటీగా 16GB RAM, భారీ స్క్రీన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×