E-Paper
Advertisement

ఏటీఎం కార్డు ఇంట్లో మర్చిపోయారా? పేటీఎం ఉంటే చాలు.. ఇలా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు!

ఏటీఎం కార్డు ఇంట్లో మర్చిపోయారా? పేటీఎం ఉంటే చాలు.. ఇలా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు!
Advertisement

Paytm New Features: డిజిటల్ పేమెంట్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పేటీఎం. ఇప్పుడు ఈ యాప్ రెండు క్రేజీ ఫీచర్లను తీసుకొచ్చింది. ఒకటి.. మనం ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు పిన్ ఎంటర్ చేసే అవసరం లేకుండా ‘బయోమెట్రిక్’ ఆప్షన్ ఇచ్చింది. రెండోది ఏమిటంటే.. పొరపాటున ఏటీఎం కార్డు ఇంట్లో మర్చిపోయినా సరే.. ఏటీఎం మిషన్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ కీలక మార్పుల వల్ల మన పనులు మరింత సులభం కానున్నాయి.

ఎందుకీ అప్డేట్?

సాధారణంగా మనం దుకాణాల్లో ఏదైనా కొన్నప్పుడు లేదంటే ఫ్రెండ్స్‌కు మనీ పంపేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 6 అంకెల యూపీఐ పిన్ కొడుతుంటాం. అయితే, రద్దీగా ఉండే చోట పిన్ నొక్కేటప్పుడు పక్కనున్న వాళ్లు చూస్తారేమో అన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు. మీ ఫోన్‌కు ఉండే ఫింగర్‌ప్రింట్ లేదంటే ఫేస్ ఐడి ద్వారానే పేమెంట్ పూర్తి చేయొచ్చు. ఆర్‌బీఐ తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం భద్రతను పెంచేందుకు పేటీఎం ఈ సదుపాయాన్ని చేర్చింది. ఇది వాడటం వల్ల సమయం ఆదా అవ్వడమే కాదు.. మన అకౌంట్‌కు సెక్యూరిటీ కూడా పెరుగుతుంది.

Advertisement

Also Read: షియోమీ విధ్వంసం.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో మిగతా ఫోన్లకు చెక్!

దీన్ని సెట్ చేసుకోవడమెలా?

పేటీఎం తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను వాడాలంటే ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీ పేటీఎం యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ఉండే ‘సెట్టింగ్స్’ బటన్ నొక్కితే ‘పే విత్ ఫింగర్‌ప్రింట్’ లేదా ‘ఫేస్ ఐడి’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి.. ఐదు వేల రూపాయల లోపు పేమెంట్లకు మాత్రమే ఈ బయోమెట్రిక్ పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువ పంపాలంటే మాత్రం ఎప్పటిలాగే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ATM లేకున్నా నగదు విత్ డ్రా..

Advertisement

చాలాసార్లు మనం హడావిడిలో ఏటీఎం కార్డు ఇంట్లో మర్చిపోయి బయటకు వెళ్తుంటాం. తీరా డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కించేదే ఈ ‘కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్’. మీరు ఏటీఎం దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ స్క్రీన్ మీద ‘యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్’ అని కనిపిస్తుంది. అది నొక్కి మీకు కావలసిన అమౌంట్ ఎంటర్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. మీ పేటీఎం యాప్‌తో దాన్ని స్కాన్ చేసి పిన్ కొడితే చాలు.. టకటకమని నోట్లు బయటకు వచ్చేస్తాయి. ఈ పద్ధతిలో రూ.10వేల వరకు తీసుకోవచ్చు.

Also Read: యూట్యూబ్ టిప్స్.. 500 సబ్‌స్క్రైబర్లు ఉన్నా ఇక డబ్బులొస్తాయ్, ఇలా చేస్తే చాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×