E-Paper
Advertisement

Induction Stove Sales: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. రికార్డ్ స్థాయిలో ఇండక్షన్ స్టవ్ సేల్స్.. 24 గంటల్లో ఎంతంటే!

Induction Stove Sales: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. రికార్డ్ స్థాయిలో ఇండక్షన్ స్టవ్ సేల్స్.. 24 గంటల్లో ఎంతంటే!
Advertisement

Induction Stove Sales: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో సామాన్యులు, హోటల్ – రెస్టారెంట్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వంట గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఎన్నడూ లేని స్థాయిలో దేశంలో ఇండక్షన్ స్టవ్ లు అమ్ముడుపోతున్నాయి.

24 గంటల్లో ఎంతంటే?

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా నివేదిక ఒకటి తెలిపింది. ఈ నేపథ్యంలో అమెజాన్ లో ఒక్క రోజులోనే ఏకంగా 1.34 లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్ లు అమ్ముడుపోయినట్లు పేర్కొంది. సాధారణంగా దేశంలో ఒక నెలకు 1.80 లక్షల ఇండక్షన్ స్టవ్ ల అమ్మకాలు జరుగుతాయని.. అలాంటిది అమెజాన్ లో ఒక రోజు వ్యవధిలోనే ఈ స్థాయి సేల్స్ జరగడం నిజంగా రికార్డేనని సదరు రిపోర్టు స్పష్టం చేసింది.

అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్

Advertisement

గ్యాస్ కొరత భయంతో పెద్ద ఎత్తున ఇండక్షన్ స్టవ్ కొనుగోలు చేస్తుండటంతో చాలా చోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్, రిటైల్ స్టోర్స్.. ఇలా ప్రతీ చోట గతంతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. అమెజాన్ తో పాటు ఫ్లిప్ కార్ట్ వంటి దిగ్గజ ఈ కామర్స్ సైట్స్ లోనూ ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన ఇండక్షన్ స్టవ్ అందుబాటులో ఉండటం లేదు.

Also Read: Air Cooler: హనీకోంబ్ ప్యాడ్ vs గ్రాస్ ప్యాడ్.. రెండింటిలో ఏ కూలర్ కొంటే బెటర్?

వైజాగ్ జోరుగా అమ్మకాలు

Advertisement

ఇండక్షన్ స్టవ్ సేల్స్ కు సంబంధించి ఏపీలోని వైజాగ్ వ్యాపారి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎలక్ట్రానిక్ షాపు నడుపుతున్న తన తండ్రిని ఎన్ని ఇండక్షన్ స్టవ్ లు అమ్మావని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ తండ్రి ఇచ్చిన సమాధానం.. కొడుకుతో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండ్రోజుల్లో 100కి పైగా ఇండక్షన్ స్టవ్ లు అమ్మినట్లు ఆ వ్యాపారి పేర్కొనడం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బిల్లింగ్ కౌంటర్ వద్ద అమ్మకానికి సిద్దంగా ఉన్న మరో 10 ఇండక్షన్ స్టవ్ లను కూడా వీడియోలో చూపించడం గమనార్హం.

Also Read: Vishwanath And Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×