E-Paper
Advertisement

Oneplus offline sales : వన్​ ప్లస్ ​లవర్స్​కు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆఫ్​లైన్​లోనూ సేల్స్​

Oneplus offline sales : వన్​ ప్లస్ ​లవర్స్​కు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆఫ్​లైన్​లోనూ సేల్స్​
Advertisement

Oneplus offline sales : గ్యాడ్జెట్​ లవర్స్​కు వన్​ ప్లస్​ ప్రొడక్ట్స్​కు సంబంధించి గుడ్​ న్యూస్ అందింది​​! దిగ్గజ స్మార్ట్ ​ఫోన్​ తయారీ అయిన ఈ వన్ ప్లస్​ సంస్థకు సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ (ఓఆర్​ఏ)తో ఉన్న వివాదాలు తొలిగాయి. లో- మార్జిన్​తో పాటు తమ మధ్య ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించుకున్నట్టు ఓఆర్​ఏ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. వినియోగదారులకు, రీటైలర్లకు, వన్ ​ప్లస్​ పార్ట్​నర్స్​కు భారీగా లబ్ధి చేకూరుస్తుందని ఓఆర్​ఏ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇక ఈ విభేదాలు తొలగడం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న ఓఆర్​ఏ మెంబర్స్​ ఇకపై వన్ ​ప్లస్​ ప్రాడక్ట్స్​ను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అలాగే వినియోగదారులు కూడా ఓఆర్​ఏ నెట్​వర్క్​ ద్వారా వన్ ​ప్లస్​కు సంబంధించిన గ్యాడ్జెట్స్​ను కొనచ్చు. పండగ సీజన్​ టీమ్​లో రీటైల్ స్టోర్స్​లో వన్​ప్లస్​ సేల్స్​ రీ స్టార్ట్​ అవ్వడం వ్యాపారులకు, వినియోగదారులకు మంచి విషయంగా టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

“నిర్మాణాత్మక చర్చలు, పరస్పర సహకారం ద్వారా మా మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నాము. ఫలితంగా వన్​ప్లస్​తో తాత్కాలికంగా ఉన్న సమస్యలు తొలిగిపోయాయి.” అని ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ ప్రకటించింది. ఈ నిర్ణయం అక్టోబర్​ 1 నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపింది.

ALSO READ : ఇన్​స్టాలో సరికొత్త ఫీచర్​ – సింగిల్ ట్యాప్​లో నచ్చిన సాంగ్​తో చిల్​!

Advertisement

” మా సభ్యులు, వినియోగదారులకు సేవలందించేందుకు, అలానే మా భాగస్వాములతో బంధం మరింత బలోపేతం చేసే దిశగా ఓఆర్​ఏ ఎప్పుడూ కృషి చేస్తుంది. భవిష్యత్​లో వన్ ​ప్లస్​తో బంధం మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం.” అని సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ టీ.ఎస్​ శ్రీధర పేర్కొన్నారు.

అసలు సమస్య ఏంటంటే? – వన్ ​ప్లస్​కు సంబంధించిన ప్రాడక్ట్స్​​ ఆఫ్ ​లైన్​ సేల్స్​ను ఆపివేయాలని ఈ ఏడాది ప్రారంభంలో ఓఆర్​ఏ నిర్ణయం తీసుకుంది. మార్జిన్లు తక్కువగా ఉండటం కూడా ఒక కారణమని తెలిపింది. సర్వీస్​ క్లెయిమ్స్​, వారెంటీలను వన్ ​ప్లస్ ఆలస్యం చేస్తుండటం కూడా మరో కారణం అని సమాచారం! అందుకే దేశవ్యాప్తంగా ఉన్న 4500 స్టోర్స్​లో వన్ ​ప్లస్​ స్మార్ట్ ​ఫోన్స్​, వాచ్​లతో పాటు ఇతర గ్యాడ్జెట్స్​ సేల్స్​ను 2024 మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు ఓఆర్​ఏ అప్పుడు ప్రకటించింది.

ఏడాదిగా వన్​ ప్లస్​ గ్యాడ్జెట్స్​తో సమస్యలు ఎదురుతున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు వన్​ ప్లస్​ ముందుకు రావడం లేదని గతంలో తెలిపింది ఓఆర్​ఏ. అందుకే సేల్స్​ను నిలిపివేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో రీటైల్​ స్టోర్స్​లో వన్ ​ప్లస్​ గ్యాడ్జెట్స్​ ​అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది అమెజాన్​ వంటి ఇ-కామర్స్​ ప్లాట్​ ఫామ్​లలో మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ స్టోర్స్​​ ఆంధ్రప్రదేశ్​తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×