E-Paper
Advertisement

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో Oppo Reno 16 Pro ఎంట్రీ.. గీక్‌బెంచ్‌లో లీకైన వివరాలు ఇవే!

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో Oppo Reno 16 Pro ఎంట్రీ.. గీక్‌బెంచ్‌లో లీకైన వివరాలు ఇవే!
Advertisement

Oppo Reno 16 Pro: ఒప్పో ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న Oppo Reno 16 సిరీస్ మార్కెట్లోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. గతకొన్ని రోజులుగా ఈ సిరీస్‌కు సంబంధించిన బేసిక్ మోడల్ నెట్టింట హల్‌చల్ చేయగా, ఇప్పుడు దీని హై-ఎండ్ వెర్షన్ అయిన Oppo Reno 16 Pro గ్లోబల్ వేరియంట్ కూడా గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు లీకయ్యాయి.

త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ:

ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై CPH2863 మోడల్ నెంబర్‌తో సరికొత్త ఒప్పో ఫోన్ దర్శనమిచ్చింది. అధికారికంగా ఈ ఫోన్ పేరును కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ.. గతంలో వచ్చిన కొన్ని సర్టిఫికేషన్ల ఆధారంగా ఇది Oppo Reno 16 Pro గ్లోబల్ వేరియంట్ అని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ సిరీస్, త్వరలోనే భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Also Read: Flipkart June Epic Sale.. భారీ డిస్కౌంట్‌తో మోటరోలా స్మార్ట్‌ఫోన్లు.. రూ.15,000 వరకు పొదుపు!

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌:

తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ మీడియాటెక్ MT6899 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. చాలామంది దీనిని మీడియాటెక్ డైమెన్సిటీ 8550 ప్రాసెసర్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే.. చైనాలో విడుదలైన మోడల్‌లోనూ ఇదే పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుందని గీక్‌బెంచ్ స్కోర్లు చెప్తున్నాయి. ఇందులో 3.40GHz గరిష్ట వేగంతో పనిచేసే ఆక్టాకోర్ ఆర్కిటెక్చర్ ఉంది.

ఆండ్రాయిడ్ 16, భారీ ర్యామ్:

Advertisement

ఈ సరికొత్త ఒప్పో ఫోన్‌లో ఏకంగా 12GB RAM లభించే అవకాశం ఉంది. మెరుగైన గ్రాఫిక్స్ కోసం Mali-G720 గ్రాఫిక్స్ కార్డ్‌ను దీనిలో అమర్చారు. వీటన్నింటికీ మించి ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుండటం విశేషం. దీనిపై ఒప్పోకు చెందిన సొంత కలర్ ఓఎస్ 16 స్కిన్ లేయర్ ఉండనుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక కానుంది.

అద్భుతమైన స్కోరు:

గీక్‌బెంచ్ 6.7.1 టెస్టులో ఈ ఫోన్ సింగిల్ కోర్ విభాగంలో 1,575 పాయింట్లు, మల్టీ కోర్ విభాగంలో 5,889 పాయింట్లు సాధించి తన సత్తా చాటింది. ఈ సిరీస్‌లోని బేసిక్ మోడల్ అయిన Oppo Reno 16 (స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్) సాధించిన స్కోర్ల కంటే Pro వెర్షన్ స్కోర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోనుందని అర్థమవుతోంది.

Also Read: మార్కెట్లోకి రాకముందే Geekbench‌లో దుమ్మురేపిన iQOO కొత్త ఫోన్.. ఏ ప్రాసెసర్‌తో వస్తుందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×