E-Paper
Advertisement

Oppo Reno 15C: మైండ్ బ్లోయింగ్ మావా.. అదిరిపోయే డిస్‌ప్లేతో ఒప్పో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్!

Oppo Reno 15C: మైండ్ బ్లోయింగ్ మావా.. అదిరిపోయే డిస్‌ప్లేతో ఒప్పో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్!
Advertisement

Oppo Reno 15C: యూజర్లను ఆకట్టుకునే ప్రత్యేక ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లు నిత్యం మార్కెట్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఒప్పో బ్రాండ్‌కు మంచి డిమాండ్ పెరిగింది. దీనికి తగ్గట్టే Oppo మార్కెట్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వాటాను కూడా పెంచుకుంటూ వ‌స్తోంది. ఇకపోతే.. ఒప్పో తన రెనో 15 సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Oppo Reno 15C పేరుగా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. సంస్థ ఈ ఫోన్‌ను ట్రెండీ లుక్స్, స్మూత్ పెర్ఫార్మెన్స్, విశ్వసనీయతను అందించే ‘ఎంట్రీ-లెవల్ ఛాయిస్’గా అభివర్ణించింది. ఒప్పో రెనో 15C గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి..

స్పెసిఫికేషన్ల వివరాలిలా:

ఈ ఫోన్ గురించి లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ ఒప్పో రెనో 15C.. 6.59-అంగుళాల ఎల్‌టీపీసీ ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని సమాచారం. ఈ ఫోన్‌లో గరిష్టంగా 12GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ అందుబాటులో ఉంటుంది. రెనో 15C ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ ఉంటుంది.

Advertisement

Read Also: అధునాతన ఫీచర్లతో ఒప్పో కొత్త ఫోన్లు.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం..

50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా:

ఈ ఒప్పో రెనో 15C ఫోన్‌.. 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్‌ను కలిగి ఉంటుందని లీకులు సూచిస్తున్నాయి. బాల్డ్ పాండా అనే టిప్‌స్టర్, ఫోన్ మెయిన్ కెమెరా సోనీ LYT600, అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్ సోనీ IMX355, టెలిఫొటో లెన్స్ శాంసంగ్ JN5 లెన్స్ అని పేర్కొన్నారు. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 50-మెగాపిక్సెల్‌గా ఉండనుంది.

బడ్జెట్ ధరలోనే:

Advertisement

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. ఈ ఫోన్ 80-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ బరువు 197 గ్రాములు. బయోమెట్రిక్ భద్రత కోసం, షార్ట్-ఫోకస్ ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది అరోరా బ్లూ, కాలేజ్ బ్లూ, స్టార్‌లైట్ బ్లూకలర్లలో అందుబాటులోకి రానుంది. అయితే, ఒప్పో సంస్థ ఇంకా లాంచ్ తేదీని వెల్లడించలేదు. ఈ ఫోన్ డిసెంబర్‌లో చైనాలో లాంచ్ కానుందని, ప్రామాణిక రెనో 15 కంటే తక్కువ ధర ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.

Read Also: వర్త్ వర్మా వర్తు.. కళ్లు చెదిరేలా మోటొరొలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×