E-Paper
Advertisement

Oppo Reno 12 Series: పోటుగాడు దిగుతున్నాడు.. AI ఫీచర్లతో రెనో 12 సిరీస్ ఇవాళే లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!

Oppo Reno 12 Series: పోటుగాడు దిగుతున్నాడు.. AI ఫీచర్లతో రెనో 12 సిరీస్ ఇవాళే లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!
Advertisement

Oppo Reno 12 Series: టెక్ బ్రాండ్ ఒప్పో తన ఫోన్ ప్రియులకు మరింత అనుభూతిని అందించేందుకు కొత్త సిరీస్‌తో మార్కెట్‌లో దర్శనమివ్వబోతుంది. Oppo తన కొత్త Oppo Reno 12 సిరీస్‌ను దేశీయ మార్కెట్‌లో ఇవాళ లాంచ్ చేయబోతుంది. ఈ సిరీస్‌లో Oppo Reno 12 5g, Oppo Reno 12 pro 5g ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లు మొదట ఇతర దేశాలలో లాంచ్ అయ్యాయి. ఇక ఈ రోజు ఈ సీరీస్‌ ఫోన్లు భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఫోన్ల ధర ఎంత ఉంటుందనేది ఇంకా అఫీషియల్‌గా తెలియలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లను రూ.30,000 నుండి రూ.40,000 వరకు అందించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్లలో AI, పెద్ద స్క్రీన్, సామర్థ్యం గల బ్యాటరీతో సహా మరిన్ని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Oppo Reno 12 సిరీస్‌ ఫోన్‌లు ఇవాళ భారతదేశంలో లాంచ్ అవుతున్నాయి. వీటి లైవ్‌ను Oppo ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వీక్షించవచ్చు. అంతేకాకుండా కంపెనీ తన ఇతర సోషల్ మీడియా సైట్‌లలో కూడా వీటికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. అయితే దీని అఫీషియల్ ధర విషయానికొస్తే.. దేశంలో ఈ ఫోన్‌ల ధర ఎంత ఉంటుందనేది ఈరోజు జరగనున్న లాంచ్ ఈవెంట్‌లోనే తేలిపోనుంది.

Advertisement

అయితే ఇండియాలో లాంచ్ కానున్న ఈ ఫోన్లు చైనాలో అమ్ముడవుతున్న ఫోన్ల మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి వాటి ధరను బట్టి చూస్తే.. చైనాలో Oppo Reno 12 ధర 2,699 యువాన్లు, Reno 12 Pro ధర 3,399 యువాన్లు. అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం.. ఈ ఫోన్‌ల ధర రూ.30,000 నుండి రూ.40,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read: కెవ్వుమనిపించే కెమెరాతో ఒప్పో రెనో 12 సిరీస్.. స్పెసిఫికేషన్స్ అదుర్స్!

Advertisement

ఇక ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. రెనో 12 సిరీస్ ఫోన్‌లు ఎక్కువగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కలిగి ఉంటాయని Oppo తెలిపింది. ఈ ఫోన్లలో AI Eraser2.0, AI బెస్ట్ ఫేస్, AI స్టూడియో, AI రికార్డింగ్ సమ్మరీ, AI రైటర్ వంటి అనేక AI ఫీచర్లు ఉంటాయని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందలేదు. కానీ చైనాలో అందుబాటులో ఉన్న ఫోన్‌ల తరహాలోనే ఈ ఫోన్‌లు ఉంటాయని భావిస్తున్నారు.

Oppo Reno 12 ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7300 చిప్ ఉంటుంది. ఇది 12GB RAM + 512GB వరకు గరిష్ట స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14.1 సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 6.7 అంగుళాలు డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అదేవిధంగా ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెనో 12 ప్రో ఫోన్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇది 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరి ఇవాళ దేశీయ మార్కెట్‌లో లాంచ్ కానున్న ఈ సిరీస్‌ ఫోన్లు ఎలా ఉంటాయో తేలిపోనుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×