E-Paper
Advertisement

Oppo Pad Mini: రూ.30వేల బడ్జెట్‌లో ఒప్పో ప్యాడ్ మినీ.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌తో వస్తోంది!

Oppo Pad Mini: రూ.30వేల బడ్జెట్‌లో ఒప్పో ప్యాడ్ మినీ.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌తో వస్తోంది!
Advertisement

Oppo Pad Mini: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా, టాబ్లెట్ల విభాగంలోనూ సత్తా చాటేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది. తాజా లీక్స్ ప్రకారం, ఒప్పో నుంచి Pad Mini పేరుతో ఒక పవర్‌ఫుల్ కాంపాక్ట్ టాబ్లెట్‌ను త్వరలో విడుదల కానుందని సమాచారం. మార్కెట్‌లో ఉన్న హువాయి మేట్‌ప్యాడ్ మినీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చేలా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్మాట్ సైజులో ఉండి, మెరుగైన పనితీరును ఆశించే యూజర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.

ప్రీమియం లుక్:

ఈ ఒప్పో Pad Mini ప్రధాన ఆకర్షణ దీని స్క్రీన్ అని చెప్పవచ్చు. ఇది 8.8 అంగుళాల కస్టమైజ్డ్ డిస్‌ప్లేతో రానుంది. హై రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే ఈ స్క్రీన్ వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు యూజర్లకు మంచి అనుభూతి కలుగుతుంది. దీని డిజైన్ చాలా స్లిమ్‌గా, బరువు తక్కువగా ఉండటంతో చేత్తో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చిన్న టాబ్లెట్ కావాలని కోరుకునే వారికి ఇదొక ప్రీమియం ఆప్షన్‌గా నిలవనుంది. చూడటానికి స్టైలిష్‌గా ఉండేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

Advertisement

Also Read: సాగదీస్తే ట్యాబ్లెట్, మడతపెడితే ఫోన్.. శాంసంగ్ జెడ్ ట్రైఫోల్డ్ 2 లాంచ్ డేట్ ఫిక్స్!

67w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

ఇక పర్ఫార్మెన్స్ విషయంలో ఒప్పో ఎక్కడా తగ్గడం లేదు. ఈ మినీ టాబ్లెట్‌లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఇది మల్టీ టాస్కింగ్, భారీ గేమ్‌లను కూడా చాలా వేగంగా రన్ చేయగలదు. అలాగే దీనిలో 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ముందు కెమెరాను అమర్చారు. దీంతోపాటు 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండనుంది. దీనివల్ల టాబ్లెట్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది.

ధర వివరాలు (అంచనా):

Advertisement

ఈ ఒప్పో ప్యాడ్ మినీ ప్రీమియం ఫీచర్లతో వస్తున్నందున దీని ధర భారత్‌లో సుమారు రూ.30వేల – రూ.35 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ట్యాబ్లెట్ మొత్తం 4 వేరియంట్లలో లభించనుంది. 8GB+256GB నుంచి మొదలుకొని 16GB+512GB వరకు వినియోగదారులు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. మోనెట్ పర్పుల్, డాన్ గోల్డ్, మోచా బ్రౌన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది మార్కెట్లోకి రానుంది. ఏప్రిల్ నెలలో చైనాలో జరగబోయే ఓ ఈవెంట్‌లో దీనిని లాంచ్ చేయనున్నారు. ఇదే సమయంలో వన్‌ప్లస్ కూడా ఈ టాబ్లెట్‌ను తన బ్రాండ్ పేరుతో రీబ్రాండ్ చేసి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: బరువు తగ్గించేందుకు.. కొండ చిలువ రక్తం, ఇదిగో ఇలా పనిచేస్తుందట!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×