E-Paper
Advertisement

భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. OPPO Pad 5 Pro, Pad Mini ప్రత్యేకతలు ఇవే!

భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. OPPO Pad 5 Pro, Pad Mini ప్రత్యేకతలు ఇవే!
Advertisement

OPPO Pad 5 Pro Launched: టెక్ ప్రియుల్లో ఒప్పో బ్రాండ్‌కు ఉన్న క్రేజే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తూ చైనాలో రెండు అదిరిపోయే టాబ్లెట్లను లాంచ్ చేసింది. అవే ఒప్పో ప్యాడ్ 5 ప్రో, ఒప్పో ప్యాడ్ మినీ. భారీ స్క్రీన్ కావాలనుకునే వారి కోసం ఒకటి, స్టైలిష్‌గా చేతిలో ఇమిడిపోయేలా ఉండాలనుకునే వారి కోసం మరొకటి.. ఇలా రెండు రకాల ఆప్షన్లతో ఒప్పో ఇప్పుడు యూజర్లలో ఆసక్తిని పెంచింది.

ధరల వివరాలు ఇలా..

ఒప్పో ప్యాడ్ 5 ప్రో బేస్ మోడల్ ధర రూ.59,000 నుంచి మొదలవుతుంది. అన్ని ఫీచర్లు ఉన్న టాప్ ఎండ్ మోడల్ కావాలంటే మాత్రం రూ.75,000 వరకు ఖర్చవుతుంది. ఇక చిన్న ప్యాడ్ మినీ ధర దాదాపు రూ.51,000 దగ్గర మొదలవుతుంది. ప్రస్తుతం ఇవి చైనాలో రిలీజ్ అయ్యాయి. ఈ నెలాఖరు లోపు అక్కడ అమ్మకాలు మొదలవుతాయి. త్వరలోనే ఇండియాలోనూ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Advertisement

Also Read: వేసవిలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా.. మల్టిపర్పస్ ఏసీ అంటే ఇదే, ధర కూడా తక్కువే!

ఏకంగా 13,380mAh బ్యాటరీ..

ఒప్పో ప్యాడ్ 5 ప్రోలో మెయిన్ హైలైట్ దాని 13.2 ఇంచుల భారీ స్క్రీన్. దీని నుంచి సినిమా చూసినా.. గేమ్స్ ఆడినా మెరుగైన పనితీరును అందిస్తుంది. పైగా దీనిలో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ వల్ల టాబ్లెట్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక బ్యాటరీ గురించి అయితే చెప్పక్కర్లేదు.. ఏకంగా 13,380mAh బ్యాటరీ ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి వాడుకోవచ్చు. దీనికి తోడు ఎనిమిది స్పీకర్లు ఇచ్చారు కాబట్టి.. సౌండ్ అదిరిపోతుంది.

పాడ్ మినీ ప్రత్యేకతలివే..

Advertisement

పెద్ద టాబ్లెట్ పట్టుకోవడం కష్టం అనుకునే వారికి ప్యాడ్ మినీ బెస్ట్ ఛాయిస్. ఇది కేవలం 8.8 ఇంచుల స్క్రీన్‌తో చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. సైజు చిన్నదైనా ఇందులో వాడిన ప్రాసెసర్ మాత్రం చాలా పవర్‌ఫుల్. ఫొటోల కోసం, వీడియో కాల్స్ కోసం రెండింటిలోనూ మంచి కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో ఇవి పనిచేస్తాయి కాబట్టి.. లేటెస్ట్ ఫీచర్లన్నీ వాడుకోవచ్చు. ఆఫీస్ వర్క్ కోసం లేదా ట్రావెలింగ్‌లో వాడుకోవడానికి ఇది చాలా బాగుంటుంది.

Also Read: టీవీ అంటే ఇలా ఉండాల్రా బాబూ.. 115 ఇంచుల భారీ స్క్రీన్‌తో Samsung Micro RGB లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×