E-Paper
Advertisement

ఒప్పో Find X9s Pro Vs షావోమి 17 బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్ ?

ఒప్పో Find X9s Pro Vs షావోమి 17 బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్ ?
Advertisement

Oppo Find X9s Pro vs Xiaomi 17: ఒప్పో (Oppo), షావోమి (Xiaomi) కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన Oppo Find X9s Pro , Xiaomi 17 ఫోన్లు ఫ్లాగ్‌షిప్ విభాగంలో ఒకదానికొకటి గట్టి పోటీని ఇస్తున్నాయి. బెస్ట్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ ప్రాసెసర్ , బెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ రెండు ఫోన్లలో ఏది మీ అవసరాలకు సరిపోతుంది? ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి ఒప్పో మేలా?  పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి షావోమి బెస్టా? ఈ రెండింటి మధ్య ఉన్న కీలక తేడాలను గురించి ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో Find X9s Pro vs షావోమి 17- ఏది బెస్ట్ ఫ్లాగ్‌షిప్?

మీరు ఒక లక్ష రూపాయల బడ్జెట్‌లో ప్రీమియం ఫోన్ కొనాలనుకుంటే.. ప్రస్తుతం మార్కెట్లో Oppo Find X9s Pro, Xiaomi 17 ప్రధాన ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి.ఈ రెండు ఫోన్లు వేర్వేరు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

Advertisement

డిస్‌ప్లే, డిజైన్:
Oppo Find X9s Pro: ఇందులో 6.32-అంగుళాల డిస్‌ప్లే ఉంది. అంతే కాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అందుకే గేమింగ్, వీడియోలకు ఇది బెస్ట్.

Xiaomi 17: షావోమి 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz అయినప్పటికీ.. 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

విన్నర్: మీరు గేమర్ అయితే ఒప్పో (144Hz), మూవీ లవర్స్ అయితే షావోమి (బ్రైట్‌నెస్) బాగుంటాయి.

పెర్ఫార్మెన్స్ :
సామర్థ్యం విషయంలో రెండు ఫోన్లలో లేటెస్ట్ చిప్‌సెట్లను వాడారు.

Oppo: మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది మల్టీ-టాస్కింగ్‌కు చాలా బాగుంటుంది.

Xiaomi: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. బెంచ్‌మార్క్ స్కోర్‌ల పరంగా షావోమి కొంచెం ముందంజలో ఉంది.

కెమెరా:
Oppo Find X9s Pro: ఒప్పో కెమెరా విభాగంలో సంచలనం సృష్టించింది. ఇందులో 200MP + 200MP + 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. హ్యాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్ వల్ల ఫొటోలు ప్రొఫెషనల్ స్థాయిలో వస్తాయి. ముఖ్యంగా జూమ్ ఫొటోలకు ఇది పెట్టింది పేరు.

Xiaomi 17: షావోమి లైకా లెన్స్‌లతో 50MP + 50MP + 50MP సెటప్‌ను అందిస్తోంది. మెగాపిక్సెల్స్ తక్కువైనా.. లైకా కలర్ సైన్స్ వల్ల ఫొటోలు చాలా సహజంగా, కళాత్మకంగా ఉంటాయి.

విన్నర్: ఎక్కువ వివరాలు, జూమ్ కావాలంటే ఒప్పో, నాచురల్ కలర్స్ కావాలంటే షావోమి.

బ్యాటరీ , ఛార్జింగ్:
Oppo: ఇందులో ఏకంగా 7025mAh భారీ బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Xiaomi: ఇందులో 6330mAh బ్యాటరీ ఉంది. కానీ 100W హైపర్ ఛార్జింగ్‌తో ఇది చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

విన్నర్: బ్యాటరీ లైఫ్ కావాలంటే ఒప్పో, స్పీడ్ ఛార్జింగ్ కావాలంటే షావోమి.

Also Read: సామ్‌సంగ్, రెడ్‌మీ,మోటో.. రూ. 15వేలలోపు ఏ బ్రాండ్ ఫోన్ బెస్ట్?

సాఫ్ట్‌వేర్ :
రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారంగా పని చేస్తాయి. ఒప్పోలో ColorOS 16 ఉంటే.. షావోమిలో కొత్త HyperOS 3 ఉంది. ధర విషయానికి వస్తే ఒప్పో Find X9s Pro రూ.79,990 ఉండొచ్చు. షావోమి 17 స్టార్టింగ్ ధర రూ.89,999 గా ఉంది.

ఏది కొనాలి?
మీకు భారీ బ్యాటరీ, అదిరిపోయే జూమ్ కెమెరా, 144Hz డిస్‌ప్లే కావాలంటే Oppo Find X9s Pro బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, లైకా కెమెరా ఫీల్,ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే Xiaomi 17 కొనడం బెస్ట్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×