E-Paper
Advertisement

Find X9 Ultra లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ కెమెరా సెటప్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

Find X9 Ultra లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ కెమెరా సెటప్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
Advertisement

OPPO Find X9 Ultra: ప్రముఖ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. ఒప్పో తమ మోస్ట్ పవర్ ఫుల్ ఫోన్ ‘Find X9 Ultra’ను ఏప్రిల్ 21న గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కేవలం డేట్ మాత్రమే కాదు.. ఈ ఫోన్‌లో ఉండబోయే కెమెరా స్పెసిఫికేషన్లు చూస్తుంటే ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్న వాళ్లకు పండగే అనిపిస్తోంది.

ఆశ్చర్యపరిచే కెమెరా సెటప్..

ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దీని కెమెరా సెటప్. ప్రముఖ కెమెరా కంపెనీ Hasselblad తో కలిసి దీనిని తయారు చేశారు. ఈ ఫోన్‌లో ఏకంగా రెండు 200MP సెన్సార్లను పెట్టారంటే నమ్ముతారా? మెయిన్ కెమెరా క్వాలిటీ 1 అంగుళం సెన్సార్‌కు ఏమాత్రం తీసిపోదట. ఇక రెండో 200MP సెన్సార్‌ను స్పెషల్ పోర్ట్రెయిట్ ఫొటోల కోసం వాడారు. ఇవి కాకుండా 10x జూమ్ చేసేలా ఒక 50MP కెమెరా, మరో 50MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం కూడా 50MP కెమెరా ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

Advertisement

Also Read: ఐఫోన్ యూజర్లకు షాక్.. యాపిల్ నుంచి ఊహించని నిర్ణయం, ఇంతకీ ఏమైందంటే?

స్టోరేజీ సమస్యలు లేకుండా..

6.78 అంగుళాల పెద్ద OLED స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్.. 144Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఇక గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. అలాగే ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 16GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో స్టోరేజ్ ఫుల్ అవుతుందన్న టెన్షన్ ఇక ఉండదు.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

సాధారణంగా ఇలాంటి హైఎండ్ ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందన్న భయం ఉంటుంది. అందుకే ఒప్పో దీనిలో ఏకంగా 7,050mAh భారీ బ్యాటరీని సెట్ చేసింది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక డిజైన్ విషయానికి వస్తే.. ఫోన్ పైన స్నాప్ కీ అనే ఒక కొత్త బటన్ ఇచ్చారు. దీనితో AI ఫీచర్లను ఈజీగా వాడుకోవచ్చు. అలాగే ఐపీ రేటింగ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి దుమ్ము, నీటి వల్ల ఫోన్ పాడవుతుందన్న బెంగ అక్కర్లేదు.

Also Read: అపరిచితులకు మీ ఫోన్ నెంబర్ కనిపించకూడదా? అయితే వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

 

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×