E-Paper
Advertisement

7500mAh బ్యాటరీ, 200MP కెమెరా.. Oppo Find X9 Proపై ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్!

7500mAh బ్యాటరీ, 200MP కెమెరా.. Oppo Find X9 Proపై ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్!
Advertisement

Flipkart Deal: భారతదేశంలో ఒప్పో బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వారం ఒప్పో కంపెనీ సరికొత్తగా Find X9s, Find X9 Ultra మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కొత్త ఫోన్ల హడావుడి ఇలా ఉంటే.. ఇదే సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో Oppo Find X9 Pro మోడల్‌పై ఊహించని రేంజ్‌లో ఆఫర్లు లభిస్తున్నాయి. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం.

ఆఫర్ల వివరాలు..

విడుదల సమయంలో Oppo Find X9 Pro అసలు ధర రూ.1,09,999గా ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నేరుగా రూ.10,000 తగ్గింపును అందిస్తూ ఈ ఫోన్‌ను రూ.99,999కే లిస్ట్ చేసింది. దీనికి తోడు మీరు గనుక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తే మరో రూ.4,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే.. ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లు.. మార్కెట్లోకి Xiaomi 400L స్మార్ట్ ఫ్రిడ్జ్.. గంటలోనే ఐస్ రెడీ!

Oppo Find X9 Pro స్పెసిఫికేషన్లు..

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 6.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది స్మూత్ బ్రౌజింగ్ కోసం 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3,600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ వేగంగా పనిచేయడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను వాడారు. అలాగే ఇందులో 16GB RAM, 512GB స్టోరేజ్‌తో పాటు రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండేందుకు ఏకంగా 7,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 50MP కెమెరా ఇచ్చారు.

కొనాలా? వద్దా?

Advertisement

మంచి కెమెరా పర్ఫార్మెన్స్, తిరుగులేని బ్యాటరీ లైఫ్, ఎలాంటి లాగ్స్ లేని పనితీరు కావాలనుకుంటే ఈ Oppo Find X9 Pro ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఏడాది మొదట్లోనే లాంచ్ అయిన ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఇంత త్వరగా భారీ డిస్కౌంట్ రావడం చాలా అరుదు. కాబట్టి ఈ డీల్ ఖచ్చితంగా ఆలోచించదగ్గదే. అయితే మీకు అర్జెంట్ లేకపోతే, రాబోయే ఏదైనా పండుగ సేల్స్ వరకు వేచి చూస్తే మరికొంత తక్కువ ధరకు వచ్చే అవకాశం కూడా ఉంది.

Also Read: రిమోట్‌తో నడిచే ప్రీమియం BLDC ఫ్యాన్లు.. అమెజాన్ సేల్లో సగం ధరకే, పవర్ బిల్లు కూడా తక్కువే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×