E-Paper
Advertisement

నెక్ట్స్ జనరేషన్ ప్రాసెసర్‌తో Oppo Foldable Phone.. లీకైన వివరాలు చూస్తే వావ్ అనాల్సిందే!

నెక్ట్స్ జనరేషన్ ప్రాసెసర్‌తో Oppo Foldable Phone.. లీకైన వివరాలు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Oppo Find N7: టెక్ లవర్స్‌కు ఒప్పో సరికొత్త సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. తమ ప్రీమియం ఫోల్డబుల్ లైనప్‌లో ‘ఒప్పో ఫైండ్ N7’ పేరుతో సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీకులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ వచ్చే ఏడాది (2027) మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వైడర్ డిజైన్:

ఈ సరికొత్త ఒప్పో ఫోన్ మునుపటి మోడల్స్ కంటే కాస్త వెడల్పుగా ఉండబోతోంది. ఫోన్‌ను పూర్తిగా విప్పినప్పుడు, కేవలం పెద్ద స్క్రీన్‌లా కాకుండా ఒక నార్మల్ స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ వెడల్పాటి డిజైన్ వల్ల గేమింగ్ ఆడేవారికి, వీడియోలు చూసేవారికి అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. అంతేకాదు.. మల్టీటాస్కింగ్ చేసుకునేందుకు కూడా ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: 11000mAh బ్యాటరీ, 10,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో Honor X80 Pro Max లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

క్రీజ్ లేని డిస్‌ప్లే:

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో స్క్రీన్ మడిచే చోట గీత (క్రీజ్) స్పష్టంగా కనిపిస్తుంటుంది. కానీ ఒప్పో తమ మునుపటి మోడల్స్ లాగే ఇందులోనూ క్రీజ్ అస్సలు కనిపించకుండా ఉండేలా ప్రత్యేక సాంకేతికతను వాడుతోంది. దీనివల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా, ఎక్కడా మడత పడినట్లు లేకుండా కనిపిస్తుంది. దీనిలో 7.6 ఇంచుల మెయిన్ డిస్‌ప్లేతో పాటు, బయట వైపు 5.5 ఇంచుల కవర్ డిస్‌ప్లేను ఇస్తున్నట్లు టాక్.

కొత్త కెమెరా సెటప్:

Advertisement

ఈసారి ఒప్పో తమ కెమెరా డిజైన్‌లో పెద్ద మార్పే చేయబోతోంది. గతంలో ఇచ్చిన గుండ్రటి కెమెరా మాడ్యూల్‌కు గుడ్‌బై చెప్పి, ఈ వైడర్ ఫోన్‌కు సరిపోయేలా అడ్డంగా ఉండే హారిజాంటల్ కెమెరా సెటప్‌ను తీసుకురానుంది. లుక్ పరంగానే కాకుండా, ఫొటోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫ్లాగ్‌షిప్ క్వాలిటీ కెమెరాలను ఒప్పో ఇందులో జోడించనుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. క్వాల్కమ్ కంపెనీకి చెందిన అప్‌కమింగ్ ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6’ ప్రాసెసర్‌ను దీనిలో వాడనున్నట్లు తెలుస్తోంది. ఇది ఫోన్ స్పీడ్‌ను పెంచడమే కాకుండా.. బ్యాటరీ లైఫ్‌ను కూడా సేవ్ చేస్తుంది. దీంతో యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థల ఫోల్డబుల్ ఫోన్లకు గట్టిపోటీ ఇచ్చేలా ఒప్పో ఈ Find N7 మోడల్‌ను ముస్తాబు చేస్తోంది.

Also Read: మోటరోలా నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో Edge 70 Max!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×