E-Paper
Advertisement

Oppo Find N6, Honor Magic V6: గెట్ రెడీ బ్రో.. సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాలు!

Oppo Find N6, Honor Magic V6: గెట్ రెడీ బ్రో.. సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాలు!
Advertisement

Oppo Find N6, Honor Magic V6: ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో టాప్ మెుబైల్ కంపెనీలు.. సరికొత్త ఫీచర్లతో అడ్వాన్స్డ్ ఫోల్డబుల్ మెుబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2026లోనూ పలు ఫోల్డబుల్ ఫోన్స్ టెక్ ప్రియుల కోసం మార్కెట్ లోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానంగా రెండు స్మార్ట్ ఫోన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవే Oppo Find N6, Honor Magic V6 స్మార్ట్ ఫోన్స్. ఇవి వచ్చే నెలలో లాంచ్ కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు సైతం నెట్టింట లీకయ్యాయి.

మల్టీస్పెక్ట్రల్ పెన్ సపోర్ట్

2026 రాబోయే ఫ్లాగ్ షిప్ ఫోల్డబుల్ ఫోన్స్ అన్ని తర్వాతి తరం ‘మల్టీస్పెక్ట్రల్’ (Multispectral) పెన్ సపోర్ట్ తో రానున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హానర్ మ్యాజిక్ వి6, ఒప్పొ ఫైండ్ ఎన్6 రెండూ మల్టీస్పెక్ట్రల్ మద్దతుతో మార్కెట్ లో అడుగుపెడతాయని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటీ? ఎలా పనిచేస్తుంది? అన్న దానిపై టెక్ నిపుణుల వద్ద సైతం క్లారిటీ లేదు. అయితే ఈ సాంకేతికత.. ఫోల్డబుల్ ఫోన్ల పనితీరులో అత్యంత కచ్చితత్వాన్ని, మెరుగైన పనితీరును, వైడర్ యాంగిల్ డిటెక్షన్, హోవర్ సపోర్ట్ ను ప్రీవియస్ మోడళ్లతో పోలిస్తే మరింత మెరుగ్గా అందిస్తాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

7,000mAh బ్యాటరీతో.. 

Advertisement

హానర్ మ్యాజిక్ వి6, ఒప్పొ ఫైండ్ ఎన్6.. ఈ ఏడాది మార్చిలో విడుదల కానున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇవి రెండు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5-పవర్డ్ ఫోల్డబుల్స్‌ (Snapdragon 8 Elite Gen 5-powered foldables)గా లాంచ్ కానున్నాయి. ఈ బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లలో 7,000mAh బ్యాటరీలు, 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలోని ఒక మోడల్ స్లిమ్ డిజైన్, బిగ్ బ్యాటరీపై ఫోకస్ చేస్తే.. మరొకటి స్టైలస్ ఫోకస్డ్ ఫీచర్ల (Stylus-focused features)పై దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నాయి.

Also Read: Honda Dio 125 X Edition: హోండా డియో 125 X ఎడిషన్ విడుదల, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఫోల్డబుల్ ఫోన్స్ క్యూ పెద్దదే..!

Advertisement

హానర్ ఇప్పటికే మ్యాజిక్ V6ను వచ్చే నెలలో MWC బార్సిలోనాలో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఒప్పొ ఫైండ్ ఎన్6 సైతం మార్చిలోనే లాంచ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక రెండో త్రైమాసికంలో మరో రెండు బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి రావొచ్చని ప్రముఖ టెక్ వెబ్ సైట్ టిప్ స్టర్ పేర్కొంది. ఇటీవలే శాంసంగ్ తన రాబోయే ఫోల్డబుల్ ఫోన్స్ Galaxy Z Fold 8, Galaxy Z Flip 8 ను రివీల్ చేసింది. మూడో మోడల్ ను గెలాక్సీ వైడ్ ఫోల్డ్ గా భావిస్తున్నారు. అయితే ఈ మోడల్స్ అన్నీ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Motorola Razr 70: మోటోరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. రేజర్ 70 త్వరలోనే లాంచ్..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×