E-Paper
Advertisement

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!
Advertisement

OPPO Enco Buds3 Pro: వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రపంచంలో ఒప్పో ఎన్కో సిరీస్‌కు ఉండే క్రేజే వేరు. ఆడియో క్లారిటీ విషయంలో ఈ బ్రాండ్ ఎప్పుడూ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ సిరీస్‌లోనే లేటెస్ట్‌గా బడ్జెట్ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తోంది OPPO Enco Buds3 Pro. కేవలం రూ. 1,599 ఆఫర్ ధరకే లభిస్తున్న ఈ  ఇయర్‌బడ్స్‌లో 12.4mm పవర్‌ఫుల్ డ్రైవర్, ఏకంగా 54 గంటల మెగా ప్లేబ్యాక్ టైమ్ వంటి మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ కింగ్ ఇయర్‌బడ్స్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

12.4mm లార్జ్ డ్రైవర్ :
ఈ ఇయర్‌బడ్స్‌లో ఇచ్చిన 12.4mm పవర్‌ఫుల్ డైనమిక్ డ్రైవర్ దీనికి బిగ్గెస్ట్ అసెట్. సాధారణంగా.. ఈ బడ్జెట్‌లో చిన్న సైజ్ డ్రైవర్స్ చూస్తుంటాం. కానీ ఒప్పో ఇందులో లార్జ్ డ్రైవర్ ఇవ్వడం వల్ల సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా ‘డీప్ బేస్’ లవర్స్‌కి ఇది పూనకాలు తెప్పిస్తుంది. థంపింగ్ బేస్‌తో పాటు సింగర్స్ వాయిస్, ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్స్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా వినబడతాయి.

Advertisement

54 గంటల మెగా బ్యాటరీ లైఫ్ :
ట్రావెలింగ్ ఎక్కువగా చేసేవారికి, రోజూ చార్జింగ్ పెట్టే ఓపిక లేనివారికి ఈ బడ్స్ ఒక పర్ఫెక్ట్ వరం. ఈ చార్జింగ్ కేస్‌తో.. కలుపుకుంటే ఏకంగా 54 గంటల పాటు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ లభిస్తుంది. అంటే.. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే వారం రోజుల పాటు బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. దీనికి తోడు టైప్-సి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. జస్ట్ కాసేపు చార్జ్ పెట్టినా గంటల కొద్దీ పాటలు వినేయొచ్చు.

డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ:
ఈ బడ్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ఇందులో డ్యూయల్ కనెక్షన్ ఇచ్చారు. అంటే మీరు ఒకే సమయంలో మీ లాప్‌టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ రెండింటికీ ఈ బడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. లాప్‌టాప్‌లో.. సినిమా చూస్తున్నప్పుడు ఫోన్‌కి కాల్ వస్తే ఆటోమేటిక్‌గా స్విచ్ అయిపోతుంది. ఇక గేమర్స్ కోసం ఇందులో అల్ట్రా లో-లేటెన్సీ మోడ్ ఉంది. దీని వల్ల పబ్‌జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు జీరో ఆడియో లాగ్‌తో ఎనిమీస్ ఫుట్‌స్టెప్స్ పక్కాగా వినిపిస్తాయి.

Advertisement

క్లియర్ కాల్స్ :
ఆఫీస్ మీటింగ్స్ లేదా రోడ్డుపై వెళ్తూ కాల్స్ మాట్లాడేవారి కోసం ఇందులో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉన్న మైక్స్ ఇచ్చారు. ఇది చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ డిస్టర్బెన్స్‌ని తగ్గించి, మీ వాయిస్‌ని అవతలి వారికి క్లియర్‌గా వినబడేలా చేస్తుంది. ఇయర్‌బడ్స్ వెనక భాగంలో స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. జస్ట్ ట్యాప్స్ ద్వారా సాంగ్స్ మార్చడం, కాల్స్ లిఫ్ట్ చేయడం, వాయిస్ అసిస్టెంట్‌ని ఆక్టివేట్ చేయడం చాలా ఈజీ.

Also Read: కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కంఫర్ట్ డిజైన్ & వాటర్ రెసిస్టెంట్ :
ఈ బడ్స్ డిజైన్ చాలా స్లిమ్‌గా, |చెవుల్లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేలా ఎర్గోనామిక్‌గా ఉంటుంది. ఒక్కో బడ్ చాలా తేలికగా ఉండటం వల్ల రోజంతా పెట్టుకున్నా నొప్పి తెలియదు. దీనికి వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ రేటింగ్ ఉండటం వల్ల జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు |చెమట పట్టినా, లేదా వర్షంలో చిన్నగా తడిసినా అస్సలు పాడవువు.

కేవలం రూ. 1,599 బడ్జెట్‌లో ఒక టాప్ బ్రాండ్ నమ్మకం, 12.4mm లార్జ్ డ్రైవర్ ఇచ్చే పవర్‌ఫుల్ సౌండ్, డ్యూయల్ కనెక్టివిటీ ,వారం రోజులు వచ్చే 54 గంటల బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే దీనిని మించిన బెస్ట్ ఛాయిస్ మార్కెట్లో లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×