E-Paper
Advertisement

సంగీత ప్రియులకు పండగే.. నాయిస్ క్యాన్సిలేషన్‌తో మార్కెట్లోకి OPPO Enco Air 5!

సంగీత ప్రియులకు పండగే.. నాయిస్ క్యాన్సిలేషన్‌తో మార్కెట్లోకి OPPO Enco Air 5!
Advertisement

OPPO Enco Air 5: ఒప్పో భారత్‌లో తమ ఆడియో పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే మార్కెట్లోకి ‘ఎన్కో ఎయిర్ 5 ప్రో’ మోడల్‌ను తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు బడ్జెట్ ప్రియుల కోసం ‘ఒప్పో ఎన్కో ఎయిర్ 5’ స్టాండర్డ్ మోడల్‌ను లాంచ్ చేయడానికి లైన్ క్లియర్ చేసింది.

త్వరలోనే భారత మార్కెట్లోకి..

ఈ సరికొత్త ఇయర్‌బడ్స్‌కు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా తమ మైక్రోసైట్‌లో లైవ్ చేసింది. అక్కడ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో ఈ ప్రొడక్ట్ కనిపిస్తుండటాన్ని బట్టి, రాబోయే కొన్ని వారాల్లోనే ఇవి అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: లాంచ్‌కు ముందే లీకైన Samsung Galaxy Watch 9.. ఈసారి క్లాసిక్ వేరియంట్ లేనట్లేనా?

ఆకట్టుకునే ఇన్‌-ఇయర్ డిజైన్..

అమెజాన్ టీజర్ ద్వారా ఈ ఇయర్‌బడ్స్ డిజైన్ ఎలా ఉండబోతుందో ముందే తెలిసిపోయింది. ఇవి సిలికాన్ ఇయర్ టిప్స్‌తో కూడిన ఇన్-ఇయర్ స్టైల్, స్టెమ్-స్టైల్ కంట్రోల్స్ కలిగి ఉన్నాయి. అలాగే వీటికి అందించిన రౌండ్ షేప్ చార్జింగ్ కేస్ ముందు భాగంలో ఛార్జింగ్, కనెక్టివిటీ స్టేటస్ తెలుసుకోవడానికి ఒక ఎల్‌ఈడీ ఇండికేటర్ కూడా ఉంది.

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్..

Advertisement

ఒప్పో ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, అమెజాన్ పేజీలో వీటిని ‘ట్రూ వైర్‌లెస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‌బడ్స్’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఈ బడ్జెట్ మోడల్‌లో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అర్థమవుతోంది.

తక్కువ ధరలోనే లభించే ఛాన్స్..

గత నెలలో విడుదలైన ‘ఎన్కో ఎయిర్ 5 ప్రో’ ధర రూ.4,999గా ఉంది. అందులో 55dB ANC, 54 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న స్టాండర్డ్ మోడల్‌లో ఫీచర్లు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read: థియేటర్ లాంటి సౌండ్, AI ఫీచర్లతో హైయర్ HQLED P7 ప్రో టీవీలు లాంచ్.. ప్రారంభ ధర ఎంతంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×