E-Paper
Advertisement

రూ.5 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఇయర్‌బడ్స్.. 54 గంటల బ్యాటరీతో OPPO Enco Air 5 Pro లాంచ్!

రూ.5 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఇయర్‌బడ్స్.. 54 గంటల బ్యాటరీతో OPPO Enco Air 5 Pro లాంచ్!
Advertisement

OPPO Enco Air 5 Pro: భారత మార్కెట్లోకి ఒప్పో సరికొత్త ప్రీమియం ఇయర్‌బడ్స్ OPPO Enco Air 5 Proను లాంచ్ చేసింది. Find X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ పరిచయం చేసింది. పాత మోడల్ Enco Air 4 Pro కంటే మెరుగైన ఆడియో క్వాలిటీ, స్మార్ట్ ఏఎన్‌సీ, అప్‌డేటెడ్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఇవి మార్కెట్లోకి అడుగుపెట్టాయి.

మన దేశంలో OPPO Enco Air 5 Pro ధరను కంపెనీ రూ.4,999గా నిర్ణయించింది. ఇవి మూన్‌స్టోన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఆకర్షణీయమైన కేసులతో లభిస్తాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు మే 28 నుండి ఒప్పో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: స్మార్ట్ ఫోన్ లాంటి ఫ్రిడ్జ్ కావాలా? అమెజాన్ డీల్స్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లపై ఓ లుక్కేయండి!

ఈ ఇయర్‌బడ్స్ 12mm డైనమిక్ డ్రైవర్‌ను కలిగి ఉండి, హై-రెజల్యూషన్ ఆడియోను అందిస్తాయి. దీనిలో ప్రత్యేకంగా 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఇది చుట్టుపక్కల వచ్చే శబ్దాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడానికి అడాప్టివ్, ట్రాన్స్‌పరెన్సీ వంటి మోడ్స్ కూడా ఉన్నాయి. దీనిలోని ట్రిపుల్ మైక్ సెటప్ వల్ల రద్దీ ప్రాంతాల్లో కూడా ఫోన్ వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

Advertisement

గేమింగ్ ప్రియుల కోసం ఇందులో 47ms లో-లేటెన్సీ మోడ్‌ను ఇచ్చారు. దీనివల్ల గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు చూసేటప్పుడు ఆడియో ల్యాగ్ అస్సలు ఉండదు. అలాగే, కేవలం చేతి వేళ్లతో టచ్ చేస్తూ, పైకి కిందకి స్లైడ్ చేస్తూ వాల్యూమ్ పెంచుకునేలా స్మార్ట్ గెస్టర్ కంట్రోల్స్ ఇందులో ఉన్నాయి.

OPPO Enco Air 5 Pro బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏఎన్‌సీ ఆఫ్ చేస్తే కేస్‌తో కలిపి ఏకంగా 54 గంటల పాటు, ఆన్ చేస్తే 29 గంటల పాటు ఇవి పనిచేస్తాయి. కేవలం ఇయర్‌బడ్స్ మాత్రమే ఏఎన్‌సీ ఆన్‌లో 7 గంటలు, ఆఫ్‌లో 13 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: 21 రోజుల బ్యాటరీ లైఫ్.. గేమింగ్ మోడ్‌తో షావోమి కొత్త స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడేవాళ్లకి పండగే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×