E-Paper
Advertisement

Oppo Enco Air 5 Pro: మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో ఒప్పో కొత్త బడ్స్ లాంచ్!

Oppo Enco Air 5 Pro: మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో ఒప్పో కొత్త బడ్స్ లాంచ్!
Advertisement

Oppo Enco Air 5 Pro: ఒప్పో తన ఆడియో పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ చైనా మార్కెట్లో కొత్తగా OPPO Enco Air 5 Pro ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన ఎయిర్ 4 ప్రోకు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ ఇయర్‌బడ్స్‌ను రూపొందించింది.

ధర వివరాలు:

ప్రస్తుతం చైనాలో విడుదలైన ఈ ఇయర్‌బడ్స్ ధర రూ.4,300. ఇవి మూన్‌స్టోన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి అక్కడ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో వీటి విడుదలపై ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా, ఒప్పో గత రికార్డును బట్టి చూస్తే త్వరలోనే ఇక్కడ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియాకు వస్తే వీటి ధర సుమారు రూ.6,000 లోపు ఉండే అవకాశం ఉండవచ్చు.

స్టైలిష్ లుక్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌లో 12mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి హైరెస్ ఆడియో కోసం LHDC 5.0 కోడెక్‌ను సపోర్ట్ చేస్తాయి. దీంతో పాటలు వినేటప్పుడు ప్రతి చిన్న శబ్దం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ముఖ్యంగా సంగీత ప్రియులకు కావాల్సిన డీటెయిల్డ్ ప్లేబ్యాక్‌ను ఇది అందిస్తుంది.

అత్యుత్తమ నాయిస్ క్యాన్సిలేషన్:

ఈ మోడల్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీనిలోని 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి. బయటి నాయిస్‌ను పూర్తిగా తగ్గించి స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. దీనిలో అడాప్టివ్ మోడ్ కూడా ఉండటంతో.. మన చుట్టూ ఉన్న శబ్దాన్ని బట్టి దానంతట అదే సెట్టింగ్స్ మార్చుకుంటుంది. ఇక కాల్స్ మాట్లాడేటప్పుడు స్పష్టత కోసం మూడు మైక్రోఫోన్లను ఇచ్చారు.

54 గంటల ప్లేబ్యాక్:

Advertisement

కొత్త బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వచ్చే ఈ ఇయర్‌బడ్స్.. ఒకేసారి రెండు డివైజులకు కనెక్ట్ అవుతాయి. గేమ్స్ ఆడేవారి కోసం 47msలో లేటెన్సీ మోడ్‌ను కూడా ఇచ్చారు. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే.. ఏఎన్సీ ఆఫ్ చేస్తే కేస్‌తో కలిపి ఏకంగా 54 గంటల ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం ఇయర్‌బడ్స్ మాత్రమే వాడితే 13 గంటల వరకు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు దీనికి అదనపు బలం అని చెప్పవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×