E-Paper
Advertisement

Open AI : చాట్ జీపీటీలో కొత్త టూల్.. చైనాకు చెక్ పెట్టిన ఓపెన్ ఏఐ

Open AI : చాట్ జీపీటీలో కొత్త టూల్.. చైనాకు చెక్ పెట్టిన ఓపెన్ ఏఐ
Advertisement

OpenAI : ఓపెన్ ఏఐ (Open AI) తీసుకువచ్చిన చాట్ జీపీటీ (Chatgpt) కు పోటీగా చైనా డీప్ సీక్ (Deepseek) ను పరిచయం చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డీప్ సీక్ కు ఆదరణ పెరుగుతుండటంతో ఓపెన్‌ఏఐ ‘డీప్‌ రీసెర్చ్‌’ పేరుతో చాట్ జీపీటీలో కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. టోక్యోలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశానికి ముందు చాట్ జీపీటీ ఈ టూల్‌ను ఆవిష్కరించింది.

చైనా తాజాగా తీసుకువచ్చిన ‘డీప్‌సీక్‌’.. కృత్రిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించింది. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్ధి నుంచి వస్తున్న తీవ్ర పోటీను ఎదుర్కోటానికి అమెరికా టెక్‌ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ (OpenAI)’ కీలక ప్రకటన చేసింది. ‘డీప్‌ రీసెర్చ్‌ (Deep Research)’ పేరుతో చాట్ జీపీటీలో కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. ఒక మనిషి కొన్ని గంటల్లో చేసే పనిని ఈ కొత్త టూల్‌ కేవలం పది నిమిషాల్లోనే చేసి పెడుతుందని.. దీంతో యూజర్స్ కు మరింత సమయం ఆదా అవుతుందని తెలిపింది.

Advertisement

ఓపెన్‌ ఏఐ తీసుకువచ్చిన డీప్‌ రీసెర్చ్‌ స్వతంత్రంగా పని చేయగలదని… ప్రాంప్ట్‌ ఇస్తే చాట్‌జీపీటీ (ChatGPT) సొంతంగా వందలాది ఆన్‌లైన్‌ సోర్సులను విశ్లేషించి.. రీసెర్చ్‌ అనలిస్ట్‌ స్థాయిలో పూర్తి స్థాయి నివేదిక రూపొందిస్తుందని.. ఆ సంస్థ తెలిపింది. టోక్యోలో జరగిన సమావేశానికి ముందు చాట్ జీపీటీ ఈ విషయాన్ని వివరించింది.

ALSO READ : అదిరే ఫ్లిప్ మెుబైల్స్ దించుతున్న సామ్సాంగ్.. లాంఛ్ ఎప్పుడంటే!

Advertisement

ఓపెన్‌ఏఐ చీఫ్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రస్తుతం టోక్యో పర్యటనలో ఉన్నారు. జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబాతో పాటు టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ అధినేత మసయోషి సన్‌తో త్వరలోనే చర్చలు జరపనున్నారు. ఇక తాజాగా ఓపెన్‌ఏఐ.. సాఫ్ట్‌బ్యాంక్‌, ఒరాకిల్‌ కలిసి ‘స్టార్‌గేట్‌’ పేరుతో ఓ కంబైన్డ్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సంస్థ ఉమ్మడిగా కృత్రిమ మేధా రంగంలో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఈ విషయన్ని అధికారికంగా వెల్లడించారు.

ఇక చైనా తీసుకొచ్చిన ఈ డీప్ సీక్.. తాజాగా అమెరికా టెక్‌ స్టాక్స్‌ను అనుకోని స్థాయిలో నష్టపరిచిన సంగతి తెలిసిందే. హాంగ్జౌకు చెందిన డీప్ సీక్ కొన్ని రోజుల క్రితమే R1 పేరిట ఏఐ మోడల్‌ను తీసుకువచ్చింది. ఇది పూర్తిగా ఉచితంగా అందించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ నెలకొంది. ఇంతకు ముందే వచ్చిన ఏఐ ఫ్లాట్ఫామ్స్  ఓపెన్‌ఏఐ, క్లాడ్‌ సోనెట్‌.. తమ సేవలు వినియోగించుకోటానికి సబ్‌స్క్రిప్షన్‌ రూపంలో కొంత మొత్తాన్ని వసూలుచేస్తున్నాయి. ఈనేపథ్యంలో పూర్తి అడ్వాన్స్‌ ఏఐ మోడల్ డీప్ సీక్ పూర్తి ఉచింతంగా వచ్చేయటంతో ఈ యాప్ కు విపరీతంగా ఆదరణ నెలకొంది. అంతేకాకుండా.. టెస్ట్‌ ఏఐ మోడల్స్ తయారీ కోసం ఓపెన్‌ఏఐ, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి టాప్ సంస్థలు బిలియన్ డాలర్స్ ఖర్చు చేస్తున్న వేళ.. డీప్‌సీక్‌ మాత్రం కేవలం 6 మిలియన్‌ డాలర్లతో లేటెస్ట్‌ ఏఐ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేసింది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×