E-Paper
Advertisement

AI చరిత్రలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. వచ్చేసింది GPT-5.5, ఇక కోడింగ్ చిటికెలో!

AI చరిత్రలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. వచ్చేసింది GPT-5.5, ఇక కోడింగ్ చిటికెలో!
Advertisement

OpenAI GPT-5.5: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ఓపెన్ ఏఐ. ఇప్పుడీ సంస్థ ‘జీపీటీ-5.5’ పేరుతో ఒక సరికొత్త మోడల్‌ను రంగంలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇది కేవలం మనం అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వడమే కాదు.. మనం ఏం కోరుకుంటున్నామో ఇట్టే పసిగట్టి ఆ పనిని ఎంచక్కా పూర్తి చేసేస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఏఐ మోడల్స్ అన్నింటిలోనూ ఇదే అత్యంత తెలివైనదని కంపెనీ చెబుతోంది. ఒక మనిషిలాగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం దీనికి వెన్నతో పెట్టిన విద్య.

వేగంలో తగ్గేదేలే:

చాలామంది ఏఐ అంటే కాస్త టైమ్ తీసుకుంటుందని అనుకుంటారు. కానీ ఈ కొత్త వెర్షన్ మాత్రం పాత జీపీటీ-5.4 ఎంత స్పీడుగా పనిచేసేదో.. అంతే స్పీడుతో అంతకంటే కచ్చితమైన రిజల్ట్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయడం, పెద్ద పెద్ద సమాచారాన్ని విశ్లేషించడం వంటి పనులను చిటికెలో చేసేస్తుంది. మనం అరకొరగా చెప్పినా కూడా విషయం అర్థం చేసుకుని, తక్కువ మాటల్లోనే పర్‌ఫెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. దీనివల్ల యూజర్లకు పదే పదే టైప్ చేసే తలనొప్పి తప్పడమే కాకుండా టైమ్ కూడా బాగా ఆదా అవుతుంది.

Advertisement

Also Read: గేమింగ్ ట్రిగ్గర్స్, ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్.. మార్కెట్లోకి వచ్చేసిన Infinix GT 50 Pro!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు పండగే:

సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్నవారికి ఈ కొత్త వెర్షన్ పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. కోడింగ్ రాయడమే కాదు.. అందులో ఎక్కడైనా తప్పులు ఉంటే ఇట్టే పట్టేస్తుంది. టెస్టింగ్‌లో చూసినప్పుడు ఇతర ఏఐ మోడల్స్ కంటే ఇది ఎంతో మెరుగ్గా పని చేస్తున్నట్లు తేలింది. మనం చెప్పకపోయినా కోడింగ్‌లో వచ్చే ఇబ్బందులను ఇది ముందే పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తుందట. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక సీనియర్ డెవలపర్ పక్కన కూర్చుని మనకు గైడ్ చేస్తున్నట్టే ఉంటుంది.

అన్నీ ఒకే చోట:

Advertisement

ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ ఈ లాంచ్ గురించి చెబుతూ.. ఇదొక సూపర్ యాప్ లాంటిదని హింట్ ఇచ్చారు. అంటే మనం ఆఫీస్ పనుల కోసం, రీసెర్చ్ కోసం వేర్వేరు టూల్స్ వాడాల్సిన అవసరం లేకుండా అన్నీ ఈ ఏఐ తోనే చక్కబెట్టేయొచ్చు. ప్రస్తుతానికి డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి (Plus, Pro యూజర్లు) ఇది అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

Also Read: Vivo T5x 5Gపై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ కొనలేరు బ్రో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×