E-Paper
Advertisement

బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌లో వన్‌ప్లస్ సంచలనం.. తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు అదరహో!

బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌లో వన్‌ప్లస్ సంచలనం.. తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు అదరహో!
Advertisement

OnePlus Turbo 6X Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ చైనా మార్కెట్లో సరికొత్త Turbo 6X సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో OnePlus Turbo 6X, OnePlus Turbo 6X Pro అనే రెండు మోడళ్లను తీసుకొచ్చింది. మీడియాటెక్ లేటెస్ట్ డైమెన్సిటీ సూపర్ సిరీస్ ప్రాసెసర్లతో పనిచేసే ఈ ఫోన్లలో భారీ బ్యాటరీలను అందించడం విశేషం. ముఖ్యంగా Pro మోడల్‌లో ఏకంగా 8,000mah బ్యాటరీని ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది.

డిస్‌ప్లేలు ఎలా ఉన్నాయంటే?

సాధారణ మోడల్ అయిన Turbo 6Xలో 6.72 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అదే Pro వేరియంట్‌లో అయితే 6.78 ఇంచుల శాంసంగ్ అమోలెడ్ 1.5k స్క్రీన్‌ను ఇచ్చారు. దీని బ్రైట్‌నెస్ ఏకంగా 6,500 నిట్స్ వరకు ఉంటుంది. రెండు ఫోన్లు కూడా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. తడి చేతులతో లేదా గ్లౌజ్ వేసుకుని కూడా వీటిని సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

Advertisement

Also Read: 200MP కెమెరా, కేక పెట్టించే డిజైన్.. శాంసంగ్ సరికొత్త అల్ట్రా ఫోన్ ఫస్ట్ లుక్ చూశారా?

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఏఐ ఫీచర్లు:

Turbo 6X ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్‌తో వస్తే.. Pro మోడల్ మరింత పవర్‌ఫుల్ డైమెన్సిటీ 7400 సూపర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వీటిలో 12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై ఇవి రన్ అవుతాయి. Pro వేరియంట్‌లో లైవ్ ఏఐ ట్రాన్స్‌లేషన్, ఏఐ రైటింగ్ అసిస్టెంట్ లాంటి అధునాతన ఫీచర్లతో పాటు గేమింగ్ కోసం ప్రత్యేక టూల్స్ కూడా ఉన్నాయి.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. Turbo 6Xలో 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అదే Pro మోడల్‌లో అయితే 50MP (OIS) కెమెరాతో పాటు 8MP వైడ్ యాంగిల్, 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇక బ్యాటరీల విషయానికొస్తే.. Turbo 6Xలో 45 వాట్ ఛార్జింగ్‌తో 7000mah బ్యాటరీ, Pro మోడల్‌లో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఏకంగా 8000mah భారీ బ్యాటరీని అందించారు. అలాగే Pro మోడల్‌కు మిలిటరీ గ్రేడ్ ఐపీ69 రేటింగ్ రక్షణ కూడా ఉంది.

ధర వివరాలు ఇలా:

చైనాలో Turbo 6X బేస్ వేరియంట్ (8GB+128GB) ధర దాదాపు రూ.26,800గా ఉంది. అలాగే Turbo 6X Pro బేస్ వేరియంట్ ధరను సుమారు రూ.28,100గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లు జూన్ 15 నుంచి అధికారికంగా అమ్మకానికి రానున్నాయి.

Also Read: Oppo K15 స్పెసిఫికేషన్స్ లీక్.. అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న క్రేజీ స్మార్ట్‌‌ఫోన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×