E-Paper
Advertisement

వన్‌ప్లస్ సమ్మర్ సేల్ మొదలైంది మామా.. ఫోన్స్, ట్యాబ్స్, బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఇక చూసుకో నా సామి రంగా!

వన్‌ప్లస్ సమ్మర్ సేల్ మొదలైంది మామా.. ఫోన్స్, ట్యాబ్స్, బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఇక చూసుకో నా సామి రంగా!
Advertisement

OnePlus Summer Sale: ఈ వేసవిలో ఒకపక్క ఎండలు మండిపోతుంటే.. మరోపక్క టెక్ లవర్స్‌కి మాత్రం వన్‌ప్లస్ చల్లని కబురు చెప్పింది. భారత్‌లో ‘వన్‌ప్లస్ సమ్మర్ సేల్’ మొదలవుతోంది. మే 8న అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ సందడి షురూ కానుంది. మనకు నచ్చిన వన్‌ప్లస్ ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌పై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో కూడా ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి. పాత ఫోన్ మార్చేసి కొత్తది తీసుకోవాలనుకునే వారికి ఇంత కంటే మంచి సమయం రాదు.

ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌పై భారీ ఆఫర్లు:

OnePlus 15, OnePlus 13 సిరీస్ లాంటి ప్రీమియం ఫోన్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ సేల్ బాగా కలిసొస్తుంది. వన్‌ప్లస్ 15 ఫోన్ బ్యాంక్ ఆఫర్లన్నీ కలిపి రూ.73,999కే వస్తోంది. ఇక వన్‌ప్లస్ 13పై అయితే ఏకంగా రూ.7,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్ మరో రూ.5,000కే ఈ పవర్‌ఫుల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు 13R, 13S, 15R మోడల్స్ కూడా తక్కువ ధరకే దొరకనున్నాయి.

Advertisement

Also Read: పార్టీ మోడ్ ఆన్.. తక్కువ బడ్జెట్‌లో టాప్-7 పార్టీ స్పీకర్లు, ఈ క్రేజీ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి!

తక్కువ బడ్జెట్‌లో Nord సిరీస్:

బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కావాలనుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ ఎప్పుడూ ఫేవరెటే. ఈ సేల్‌లో OnePlus Nord 6
పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫర్లు పోగా ఈ ఫోన్ రూ.36,999కే లభిస్తుంది. మంచి కెమెరా, స్టైలిష్ లుక్, స్పీడ్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి నార్డ్ 6 బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

టాబ్లెట్లపై అదిరిపోయే డీల్స్..

Advertisement

ఫోన్లే కాదు.. వన్‌ప్లస్ టాబ్లెట్లపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. లేటెస్ట్ టాబ్లెట్ OnePlus Pad 4పై రూ.5,000 బ్యాంక్ ఆఫర్ ఉంది. దీంతో ఈ ట్యాబ్ రూ.54,999కే వచ్చేస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువైతే.. OnePlus Pad Go 2 లేదా Pad Lite అయితే కేవలం రూ.14,999కే లభిస్తోంది. ఆఫీస్ పనులకు లేదంటే పిల్లల చదువులకు ఇవి భలే ఉపయోగపడతాయి.

రూ.2 వేలకే నార్డ్ బడ్స్ సిరీస్..

ఎక్కువగా పాటలు వినే వాళ్ల కోసం వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. OnePlus Buds Pro 3పై తగ్గింపులన్నీ పోగా రూ.9,999కే వస్తోంది. బడ్జెట్ తక్కువలో కావాలంటే Nord Buds సిరీస్ కూడా ఉంది. ఇవి రూ.2 వేల నుంచే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆడియో ప్రొడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు బ్లింకిట్ లాంటి యాప్స్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

ఈఎంఐ ఆప్షన్లు కూడా..

ఈ సేల్‌లో కేవలం ధర తగ్గింపు మాత్రమే కాదు.. ICICI వంటి బ్యాంక్ కార్డుల మీద ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఒకేసారి అంత డబ్బు కట్టలేము అనుకుంటే.. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఆన్‌లైన్‌లోనే కాదు.. దగ్గర్లోని వన్‌ప్లస్ స్టోర్లకు వెళ్లి కూడా ఈ ఆఫర్లను నేరుగా పొందవచ్చు.

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. రూ.25వేల లోపు ఇంత మంచి టాబ్లెట్లా? ఈ లేటెస్ట్ లిస్ట్ చూస్తేనే మతిపోతుందిగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×