E-Paper
Advertisement

OnePlus Open 2 : యాపిల్, సామ్సాంగ్ కు వన్​ప్లస్ షాక్! ముందెన్నడూ లేని ఫీచర్స్ తో కొత్త మెుబైల్ వచ్చేస్తుందోచ్

OnePlus Open 2 : యాపిల్, సామ్సాంగ్ కు వన్​ప్లస్ షాక్! ముందెన్నడూ లేని ఫీచర్స్ తో కొత్త మెుబైల్ వచ్చేస్తుందోచ్
Advertisement

OnePlus Open 2 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. వచ్చే ఏడాది రెండవ త్రైమాసికంలో అదిరే కొత్త మెుబైల్ ను తీసుకురాబోతుంది. OnePlus Open 2 పేరుతో వచ్చేస్తున్న ఈ మెుబైల్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ తో గ్లోబల్ మార్కెట్‌లోకి లాంఛ్ కాబోతుంది.

వన్ ప్లస్ కంపెనీ OnePlus Open మెుబైల్ ను స్టార్ట్ చేసిన సమయంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చిన్నపాటి తుఫాన్ వచ్చిందనే చెప్పాలి. అయితే, ఇది పాత కథ.. ఇప్పుడు ఆ బ్రాండ్ పేరుతో మరో కొత్త మెుబైల్ ను పాత మెుబైల్ కు ధీటుగా తీసుకురావటానికి వన్ ప్లస్ సన్నాహాలు చేస్తుంది. అయితే వచ్చే ఏడాది ఈ మెుబైల్ చైనాలో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మెుబైల్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ముందు వెర్షన్ తో పోలిస్తే లేటెస్ట్ ఫీచర్స్ తో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక Oppo Find N5 రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా తెలుస్తుంది. ఈసారి, OnePlus కొత్త ఫీచర్లతో పాటు మెురుగైన క్వాలిటీస్ తో OnePlus ఓపెన్ 2ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

OnePlus Open 2 Features – 

ఈ మొబైల్ లేటెస్ట్ అప్డేట్స్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌ తో పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. Weiboలో ప్రముఖ టిప్‌స్టర్ అయిన డిజిటల్ చాట్ స్టేషన్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వచ్చిన దాని ముందు వెర్షన్ తో పోలిస్తే ఇది ఒక పెద్ద మార్పని తెలిపింది. ఇక ఈ కొత్త ఫోన్ లో మెరుగైన గేమింగ్ అనుభవం సైతం పొందే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

ఎంతో గ్రాండ్ గా లాంఛ్ అయిన వన్ ప్లస్ ఓపెన్ మొబైల్.. వైర్లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయకపోవడం కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రాబోతున్న వన్ ప్లస్ ఓపెన్ టు మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ను కలిగి ఉండనుంది. దీంతో లేటెస్ట్ మెుబైల్స్ కు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇతర లీక్స్ సైతం టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. OnePlus Open 2కి IPX8 వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంటుందని తెలుస్తుంది. ‘యాంటీ డ్రాప్ బాడీ స్ట్రక్చర్’ అనే ప్రత్యేక లక్షణాన్ని కూడా ఉండనుంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ మంచి మన్నికను కలిగి ఉంటుందని తెలుస్తుంది.

వన్‌ప్లస్ ఓపెన్ 2 సెన్సార్‌లకు సంబంధించిన కొన్ని లీక్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆప్టికల్ జూమ్ సదూపాయంతో 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉండనుంది.

ఇక లాంఛ్ విషయానికొస్తే, Oppo Find N5 మార్చి 2025 చివరి నాటికి చైనీస్ మార్కెట్‌కు రాబోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. 2025 రెండవ త్రైమాసికం నాటికి OnePlus Open 2 ఇండియాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×