E-Paper
Advertisement

వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే.. 8000mAh బ్యాటరీతో నార్డ్ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా!

వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే.. 8000mAh బ్యాటరీతో నార్డ్ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా!
Advertisement

OnePlus Nord CE 6: వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వన్‌ప్లస్ పాపులర్ Nord సిరీస్‌లో సరికొత్త ఫోన్లను ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దించనుంది. OnePlus Nord CE 6, అలాగే OnePlus Nord CE 6 Lite మోడళ్లను మే 7న మధ్యాహ్నం 12 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. అయితే టెక్ ప్రియుల్లో ఇప్పటికే ఈ ఫోన్లపై భారీ అంచనాలు ఉండటంతో.. కంపెనీ కూడా వీటి సేల్ వివరాలను ముందుగానే రివీల్ చేసి అందరినీ ఖుషీ చేసింది.

సేల్ ప్రారంభం ఎప్పుడంటే?

ఈ కొత్త ఫోన్లు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయా అని ఎదురుచూసే వాళ్ల కోసం కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. OnePlus Nord CE 6 అమ్మకాలు మే 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే మొదలవుతాయి. ఇక బడ్జెట్ ధరలో ఫోన్ కావాలనుకునే వారికి Nord CE 6 Lite మే 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. వీటిని అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు దగ్గర్లోని స్టోర్లలో కూడా కొనుగోలు చేయొచ్చు. ఇక కలర్స్ విషయానికొస్తే.. Nord CE 6 బ్లూ, బ్లాక్, పెర్ల్ కలర్స్‌లో మెరిసిపోతుంటే.. Lite మోడల్ మాత్రం మింట్, బ్లాక్ షేడ్స్‌లో స్టైలిష్‌గా ఉండబోతోంది.

Advertisement

Also Read: పార్టీ మోడ్ ఆన్.. తక్కువ బడ్జెట్‌లో టాప్-7 పార్టీ స్పీకర్లు, ఈ క్రేజీ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి!

బ్యాటరీ బ్యాకప్ అదుర్స్..

వన్‌ప్లస్ నుంచి వస్తున్న ఈ ఫోన్లలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం వీటి బ్యాటరీ సామర్థ్యం. నార్డ్ CE 6 మోడల్‌లో కళ్లు చెదిరేలా 8,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇక లైట్ వెర్షన్‌లో కూడా తక్కువేం కాకుండా 7,000mAh బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇక ప్లగ్ పాయింట్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. దీనికి తోడు నార్డ్ CE 6లో 1.5K రిజల్యూషన్ ఉన్న అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది కాబట్టి.. వీడియోలు చూసేటప్పుడు పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.

ధర వివరాలు ఇలా..

Advertisement

ఈ ఫోన్ల పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పీడ్‌గా ఉండేలా ప్లాన్ చేశారు. నార్డ్ CE 6లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ వాడారు. గేమింగ్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ స్లో అవ్వదు. ఇకపోతే ఈ రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా ఇచ్చారు. ఇది మంచి క్వాలిటీ ఫొటోలను క్లిక్ మనిపిస్తుంది. అలాగే సెల్ఫీల కోసం నార్డ్ CE 6లో 32MP కెమెరా ఉంది. ఇక లైట్ మోడల్ ధర రూ.20వేల నుంచి రూ.25వేల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Also Read: పోర్టబుల్ ఏసీ vs టవర్ కూలర్.. మండుతున్న ఎండలకు ఏది బెస్ట్? కొనేముందు ఈ తేడాలు తెలియకపోతే నష్టపోతారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×