E-Paper
Advertisement

మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. గేమర్స్ కోసం OnePlus Nord CE 6 వచ్చేస్తోంది!

మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. గేమర్స్ కోసం OnePlus Nord CE 6 వచ్చేస్తోంది!
Advertisement

OnePlus Nord CE 6: వన్‌ప్లస్ నుంచి మరో రెండు పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ CE 6, వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ పేర్లతో వస్తున్న ఈ ఫోన్లను చూస్తుంటే.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి పండగే అనిపిస్తోంది. మే 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరకే క్వాలిటీ ఫోన్లు ఇవ్వడమే లక్ష్యంగా వన్‌ప్లస్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది.

ఫోన్ ఎంత బాగున్నా.. ఛార్జింగ్ త్వరగా అయిపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. ముఖ్యంగా గేమర్స్, వీడియోలు చేసేవాళ్ల బాధ వర్ణనాతీతం. అందుకే వన్‌ప్లస్ నార్డ్ CE 6లో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. ఇక రోజంతా వాడుకున్నా భయం లేదు. సుమారు 10 గంటల పాటు నాన్‌స్టాప్‌గా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక లైట్ వేరియంట్‌లో కూడా 7000mAh బ్యాటరీ ఉంది. ఇది మామూలు వాడకానికి రెండు రోజుల వరకు వస్తుంది. అవసరమైతే ఈ ఫోన్ ద్వారా వేరే చిన్న చిన్న గాడ్జెట్స్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

ఫోన్ స్లోగా ఉంటే ఎంత చిరాకు వస్తుందో మనందరికీ తెలిసిందే. అందుకే ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను వాడారు. దీనివల్ల భారీ యాప్స్ వాడినా.. ఒకేసారి నాలుగైదు పనులు చేసినా ఫోన్ ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు మంచి స్పీడ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక లైట్ మోడల్‌లో కూడా నమ్మకమైన మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడుకునేటప్పుడు అస్సలు ల్యాగ్ ఉండదు.

Also Read: అబ్బా ఏముంది మావా ఈ ఫోను.. బుక్కులా విచ్చుకునే Huawei Pura X Max వచ్చేసింది!

Advertisement

మనం ఎక్కువగా ఫోన్ చూసేదే వీడియోల కోసం, సినిమాల కోసం కదా. అందుకే డిస్‌ప్లే విషయంలో వన్‌ప్లస్ ఎక్కడా రాజీ పడలేదు. ఎండలో ఉన్నా సరే స్క్రీన్ మీద అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక రాత్రిపూట చీకట్లో ఫోన్ చూసే అలవాటు ఉన్నవారి కోసం కళ్లు పాడవకుండా ప్రత్యేకమైన టెక్నాలజీని కూడా దీనిలో పెట్టారు. గేమ్స్ ఆడేటప్పుడు గానీ, వీడియోలు చూసేటప్పుడు గానీ రంగులు చాలా సహజంగా, రిచ్‌గా కనిపిస్తాయి.

ఈ ఫోన్లను చేత్తో పట్టుకుంటే చాలా స్టైలిష్‌గా ఉంటాయి. నార్డ్ CE 6 వెనుక పక్క డిజైన్ చాలా కొత్తగా ఉంది. ఇందులో మంచి కెమెరా సెటప్‌తో పాటు పవర్‌ఫుల్ ఫ్లాష్ కూడా ఉంది. కాబట్టి చీకట్లో కూడా ఫొటోలు బాగా వస్తాయి. ఇంకో మంచి విషయం ఏమిటంటే.. వీటిని నీళ్లు, దుమ్ము నుంచి ఫోన్‌ను రక్షించేలా తయారుచేశారు. ఇన్ని మంచి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లు.. మిడ్‌రేంజ్ ధరలో ఖచ్చితంగా మార్కెట్‌ని షేక్ చేస్తాయని చెబుతున్నారు టెక్ నిపుణులు.

Also Read: భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. OPPO Pad 5 Pro, Pad Mini ప్రత్యేకతలు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×