E-Paper
Advertisement

రూ.20 వేలకే వన్‌ప్లస్ కొత్త ఫోన్.. Nord CE 6 సిరీస్ అదిరిపోయే ఎంట్రీ, సేల్ ఎప్పటి నుంచంటే?

రూ.20 వేలకే వన్‌ప్లస్ కొత్త ఫోన్.. Nord CE 6 సిరీస్ అదిరిపోయే ఎంట్రీ, సేల్ ఎప్పటి నుంచంటే?
Advertisement

OnePlus Nord Series: తక్కువ బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా మోస్ట్ పాపులర్ బ్రాండ్ వన్‌ప్లస్ ఫోన్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో సరికొత్త Nord CE 6 మోడళ్లు భారత్‌లో లాంచ్ అయ్యాయి. దీనిలో Nord CE 6తో పాటు Nord CE 6 Lite అనే రెండు ఫోన్లను లాంచ్ చేసింది. ఈసారి లుక్ పరంగా వన్‌ప్లస్ పెద్ద మార్పే చేసింది. ఎప్పుడూ ఉండే పాత డిజైన్ కాకుండా.. వెనుక వైపు కెమెరా సెటప్‌ను సరికొత్తగా స్క్వేర్ షేప్‌లో డిజైన్ చేసి ఫోన్‌కు ఒక కొత్త కళను తీసుకొచ్చింది.

ధర వివరాలు ఇలా..

మిడిల్‌క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వన్‌ప్లస్ ఈ ఫోన్ల ధరలను కూడా రీజనబుల్‌గానే పెట్టింది. Nord CE 6 బేస్ మోడల్ ధర రూ.29,999 కాగా, టాప్ మోడల్ రూ.32,999కి అందుబాటులో ఉంది. బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ల కోసం తీసుకొచ్చిన Lite మోడల్ రూ.20,999 నుంచే మొదలవుతుంది. ఈ నెల 8న Nord CE 6, 12వ తేదీన Lits మోడల్ అమ్మకానికి వస్తాయి. అమెజాన్ లేదా వన్‌ప్లస్ స్టోర్లలో వీటిని కొనొచ్చు. పైగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ వాడుకుంటే రూ.2,000 దాకా తగ్గింపు కూడా పొందొచ్చు.

అదిరిపోయే లుక్..

Advertisement

ఈ ఫోన్ లుక్ చూడగానే ముచ్చటగొలిపేలా ఉంది. Nord CE 6లో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక 3,600 నిట్స్ బ్రైట్‌నెస్ అంటే మామూలు విషయం కాదు.. మిట్ట మధ్యాహ్నం ఎండలో బయట నిలబడి ఫోన్ చూసినా స్క్రీన్ మీద ఉన్నవన్నీ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఫోన్ తడిసినా, దుమ్ము పడినా పాడవకుండా గట్టి రేటింగ్‌లే ఇచ్చారు.

Also Read: 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, అమోలెడ్ డిస్‌ప్లే.. మార్కెట్లోకి Redmi Watch 6 ఎంట్రీ, ఇక రచ్చే!

లోపలే కూలింగ్ సిస్టమ్..

Advertisement

ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండటానికి వన్‌ప్లస్ మంచి ప్రాసెసర్లే వాడింది. Nord CE 6లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ఉండటం వల్ల గేమ్స్ ఆడేవారికి చాలా బాగుంటుంది. ఇక లైట్ మోడల్‌లో డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను పెట్టారు. ఈ రెండూ కూడా కొత్త ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్నాయి. ఫోన్ ఎక్కువ సేపు వాడినా వేడెక్కకుండా లోపల కూలింగ్ సిస్టమ్‌ను కూడా పక్కాగా ప్లాన్ చేశారు.

80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం..

ఇక కెమెరా విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరా ఉంది. దీనితో 4K వీడియోలు కూడా తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీల కోసం Nord CE 6లో 32MP కెమెరా ఇస్తే.. లైట్‌లో 8MP కెమెరాను అమర్చారు. ఇక అన్నిటికంటే హైలైట్ ఈ ఫోన్ల బ్యాటరీ లైఫ్. Nord CE 6లో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా తోడైంది. తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ సిరీస్‌లోని ఫోన్లు బాగా నచ్చుతాయి.

Also Read: ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పొడవుగా ఉంటే.. ఛార్జ్ స్లోగా ఎక్కుతుందా? టెక్ నిపుణులు చెప్పిన సీక్రెట్ ఇదే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×