E-Paper
Advertisement

డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ, ఏఐ ట్రాన్స్‌లేషన్ సపోర్ట్. .మార్కెట్‌లో రచ్చ లేపుతున్న వన్ ప్లస్

డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ, ఏఐ ట్రాన్స్‌లేషన్ సపోర్ట్. .మార్కెట్‌లో రచ్చ లేపుతున్న వన్ ప్లస్
Advertisement

OnePlus Nord Buds 3r TWS:  ఈ రోజుల్లో మంచి మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలన్నా, ఆఫీస్ కాల్స్ మాట్లాడాలన్నా పర్ఫెక్ట్ TWS ఇయర్‌బడ్స్ ఉండాల్సిందే. మార్కెట్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నా.. ‘వన్‌ప్లస్’బ్రాండ్ ఇచ్చే ప్రీమియం ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్! బడ్జెట్ ధరలో.. మ్యూజిక్ లవర్స్, గేమర్స్ కోసం వన్‌ప్లస్ రీసెంట్‌గా తీసుకొచ్చిన మోడలే OnePlus Nord Buds 3r (Ash Black). కేవలం రూ.1,799 ధరకే ఏకంగా 54 గంటల ప్లేబ్యాక్, 3D స్పేషియల్ ఆడియో, ఏఐ ట్రాన్స్‌లేషన్ వంటి మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus Nord Buds 3r:

రూ.2,000 లోపు ఒక మంచి బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వారికి OnePlus Nord Buds 3r ఒక సూపర్ ఆప్షన్. యాష్ బ్లాక్ కలర్‌లో క్లాసీగా కనిపించే ఈ బడ్స్‌లో ..ఉన్న అద్భుతమైన ఫీచర్లు..

54 గంటల అన్‌స్టాపబుల్ బ్యాటరీ:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ లోని అతి పెద్ద హైలైట్ దీని బ్యాటరీ లైఫ్. కేస్ తో కలిపి ఇది ఏకంగా 54 గంటల పాటు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. అంటే.. మీరు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, వారం రోజుల పాటు ఛార్జర్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. లాంగ్ ట్రావెలింగ్ చేసేవారికి, తరచూ వెబ్‌సిరీస్‌లు చూసేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి.

12.4mm డ్రైవర్స్ & 3D స్పేషియల్ ఆడియో :

సౌండ్ క్వాలిటీ విషయంలో.. వన్‌ప్లస్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇందులో పెద్ద 12.4mm డైనమిక్ డ్రైవర్స్ ఇచ్చారు. దీని వల్ల బేస్ చాలా డీప్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది. వీటికి తోడు 3D స్పేషియల్ ఆడియో (3D Spatial Audio) సపోర్ట్ ఉండటం వల్ల, థియేటర్లలో కూర్చుని సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

2-Mic క్లియర్ కాల్స్ & AI ట్రాన్స్‌లేషన్ :

Advertisement

ఆఫీస్ మీటింగ్స్ లేదా రోడ్డుపై వెళ్తూ కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి ఇందులో.. 2-Mic క్లియర్ కాల్స్ టెక్నాలజీ ఉంది. దీనిలోని ఏఐ నాయిస్ రిడక్షన్ చుట్టు పక్కల ఉండే గోలని తగ్గించి మీ వాయిస్‌ని అవతలి వారికి స్పష్టంగా వినేలా చేస్తుంది. అంతేకాకుండా.. ఇందులో సరికొత్తగా ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా ఉంది. కాబట్టి ఇది ఇతర దేశ భాషలను ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.

Also Read: రూ.5వేలలోపే పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్.. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ !

గేమర్స్ కోసం 47ms లో-లేటెన్సీ :

మీరు ఫోన్‌లో BGMI లేదా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతుంటే.. ఆడియో ల్యాగ్ లేకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇందులో 47ms అల్ట్రా-లో లేటెన్సీ మోడ్ ఉంది. దీని వల్ల మీరు గేమ్‌లో బుల్లెట్ షూట్ చేసిన వెంటనే సౌండ్ ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది.

డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ :

సాధారణంగా బడ్జెట్ బడ్స్‌లో ఈ ఫీచర్ ఉండదు. కానీ Nord Buds 3r లో డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ ఇచ్చారు. అంటే మీరు ఒకే సమయంలో మీ లాప్‌టాప్ , మొబైల్ ఫోన్‌కి ఈ బడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. లాప్‌టాప్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఫోన్‌కి కాల్ వస్తే.. ఆటోమేటిక్‌గా ఫోన్‌కి స్విచ్ అయిపోతుంది.

కేవలం రూ.1,799 బడ్జెట్‌లో వన్‌ప్లస్ లాంటి టాప్ బ్రాండ్ నుండి 54 గంటల బ్యాటరీ, అద్భుతమైన బేస్, డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ , గేమింగ్ మోడ్ లభించడం నిజంగా క్రేజీ డీల్. తక్కువ ధరలో.. ప్రీమియం TWS ఇయర్‌బడ్స్ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ OnePlus Nord Buds 3r ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×