E-Paper
Advertisement

OnePlus Nord 4 Launch: అదుర్స్.. వన్‌ప్లస్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు.. ఏది వదలకండి!

OnePlus Nord 4 Launch: అదుర్స్.. వన్‌ప్లస్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు.. ఏది వదలకండి!
Advertisement

OnePlus Nord 4 Launch: వన్‌ప్లస్ Nord సిరీస్ నుంచి OnePlus Nord 4, OnePlus Nord CE 4 Lite ఫోన్లను తీసుకురానుంది. OnePlus Nord సిరీస్‌లోని ఈ కొత్త ఫోన్‌లు మార్కెట్‌లో మంచి కాంపిటీషన్ ఇస్తాయని కంపెనీ భావిస్తోంది. ఈ ఫోన్‌లలో మంచి కెమెరా ఫీచర్లను తీసుకురానున్నారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. Nord సిరీస్‌కి చెందిన రెండు కొత్త ఫోన్‌లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.ఈ డివైజ్‌ల లాంచ్ తేదీ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. లాంచ్ చేయడానికి ముందు ఈ ఫోన్‌లు బ్లూటూత్ SIGలో లిస్ట్ చేయబడ్డాయి. దీని ప్రకారం ఎటువంటి ఫీచర్లు ఉంటాయో చూద్దాం.

OnePlus కొత్త ఫోన్‌ల ఫీచర్ల గురించి మాట్లాడితే OnePlus Nord 4 చైనాలో విడుదలైన OnePlus Ace 3V రీబ్రాండెడ్ వెర్షన్. కంపెనీ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయవచ్చు. ప్రాసెసర్‌గా మీరు ఇందులో స్నాప్‌డ్రాగన్ 7+ J3 చిప్‌సెట్‌ని చూస్తారు. Nord 4 స్మార్ట్‌ఫోన్ 12 GB RAM స్టోరేజ్‌తో రావచ్చు. మీరు ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేను చూడవచ్చు.

Advertisement

ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ రేంజ్ 2150 నిట్‌ల వరకు ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌తో LED ఫ్లాష్‌ ఉంటుంది. ఫోన్ మెయిన్ కెమెరా   OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బ్యాటరీ 5500mAh ఉంటుంది. ఇది 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: క్రేజీ ప్రైస్ డ్రాప్.. చాలా చవకగా ఐఫోన్లు.. ఇదే మంచి టైమ్!

Advertisement

OnePlus Nord CE 4 Lite గురించి మాట్లాడితే ఈ ఫోన్ బెడ్జెట్ ధరలో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఫోన్ Oppo A3 రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుంది. ఇందులో కంపెనీ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను తీసుకురానుంది. ఈ ఫోన్ Snapdragon 6 Gen 1 ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 5500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×