E-Paper
Advertisement

సామాన్యుల కోసం చౌకైన ధరకే OnePlus N6.. భారత మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే!

సామాన్యుల కోసం చౌకైన ధరకే OnePlus N6.. భారత మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే!
Advertisement

OnePlus N6: ఇండియన్ మార్కెట్‌లోకి ప్రముఖ టెక్ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరో సరికొత్త మొబైల్‌ త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది. OnePlus N6 పేరుతో రానున్న ఈ ఫోన్.. ఈ నెలాఖరున లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇదేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లాంచ్‌కు ముందే కంపెనీ దీనికి సంబంధించిన డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది.

డ్యూయల్ కెమెరా సెటప్:

ఈ OnePlus N6 ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తోంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించారు. కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 50MP వస్తోంది. ఇక సెల్ఫీల కోసం స్క్రీన్ పైభాగంలో పంచ్-హోల్ డిజైన్‌తో 8MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. దీని ద్వారా యూజర్లు 60 fps వేగంతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్ 16తో వచ్చేసిన Samsung Galaxy A27 5G.. ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్!

వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీ:

ఇందులో 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. మూడ్రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని, అలాగే ఏడేళ్ల పాటు బ్యాటరీ మన్నిక బాగుటుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా.. ఫోన్ వేడెక్కకుండా చూసేందుకు 5,300 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం గల ప్రత్యేక ‘వేపర్ ఛాంబర్ కూలింగ్’ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు.

పనితీరు ఎలా ఉంటుందంటే?

Advertisement

OnePlus N6 మీడియాటెక్ డైమెన్సిటీ (6300 లేదా 6100+) ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. దీనికి తోడు 6GB RAM, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్ దీనిలో ఉంటాయి. గీక్‌బెంచ్ టెస్టుల్లో కూడా ఈ ఫోన్ మంచి స్కోరు సాధించింది. వినియోగదారులు ఈ ఫోన్‌ను ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?

ఈ వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ జూన్ 30న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఇది అమ్మకానికి రానుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.18,000 నుండి రూ.25,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ బ్రాండ్ ఫోన్, భారీ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది.

Also Read: ఇంత తక్కువ ధరలో అలాంటి ఫీచర్లా? మార్కెట్‌లోకి సైలెంట్‌గా వచ్చి రచ్చలేపుతున్న Vivo Y6a!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×