E-Paper
Advertisement

గేమర్ల కోసం OnePlus సరికొత్త ప్రయోగం.. ఈ ఫోన్ కొంటే గేమింగ్ కన్సోల్‌ను ఫ్రీగా పట్టుకెళ్లొచ్చు!

గేమర్ల కోసం OnePlus సరికొత్త ప్రయోగం.. ఈ ఫోన్ కొంటే గేమింగ్ కన్సోల్‌ను ఫ్రీగా పట్టుకెళ్లొచ్చు!
Advertisement

OnePlus Ace 6 Ultra: ఎక్కువగా ఆన్‌లైన్ గేమింగ్ ఆడేవారి కోసం ప్రముఖ టెక్ సంస్థ వివో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఏప్రిల్ 28న చైనా సరికొత్త ఫోన్ OnePlus Ace 6 Ultraను లాంచ్ చేస్తోంది. అయితే ఈసారి కేవలం ఫోన్ మాత్రమే కాదు.. గేమర్స్ కోసం ప్రత్యేకంగా OnePlus Strix G15 అనే క్రేజీ గేమింగ్ కంట్రోలర్‌ను కూడా తీసుకొస్తోంది. సాధారణంగా వన్‌ప్లస్ ఏస్ సిరీస్ ఫోన్లు అంటే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ ఈసారి వేగంతో పాటు గేమర్లు కంఫర్ట్‌గా ఆడుకోవడానికి బోలెడు ఫీచర్లను కూడా జోడించింది.

ఫోనే గేమింగ్ కన్సోల్‌గా..

ఈ ఫోన్‌తో పాటు వస్తున్న స్ట్రిక్స్ జీ15 కంట్రోలర్ గురించి ముందుగా చెప్పుకోవాలి. దీన్ని ఫోన్‌కి రెండు వైపులా తగిలిస్తే చాలు.. ఫోన్ ఒక చిన్న గేమింగ్ కన్సోల్‌లా మారిపోతుంది. దీని డిజైన్ చాలా స్మూత్‌గా ఉండటం వల్ల ఎంతసేపు ఆడినా చేతులు నొప్పి పుట్టవు. ముఖ్యంగా దీనిలో ఉండే రెడ్ కలర్ షోల్డర్ బటన్స్ షూటింగ్ గేమ్స్ ఆడేవారికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇక గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కుతుందన్న టెన్షన్ అక్కర్లేదు.. ఎందుకంటే ఈ కంట్రోలర్‌లోనే ఒక చిన్న కూలింగ్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. గేమ్ ఆడుతూనే కింద వైపు ఉన్న పోర్ట్ ద్వారా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు.

Advertisement

Also Read: హువావే వాచ్ ఫిట్ 5 లీక్.. వామ్మో ఇన్ని ఫీచర్లా? ధర తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

మెటల్ ఫ్రేమ్ డిజైన్..

ఈ OnePlus Ace 6 Ultra ఫోన్‌లో 6.78 అంగుళాల పెద్ద స్క్రీన్ ఇచ్చారు. 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ చాలా స్మూత్‌గా, ఎక్కడా ఆగకుండా సాగిపోతుంది. అలాగే దీనిలో ఉన్న డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. నెట్‌వర్క్ సమస్యలు రాకుండా లోపల మెటల్ ఫ్రేమ్ డిజైన్‌ను కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఫోన్ అన్‌లాక్ చేయడానికి లేటెస్ట్ 3డీ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను వాడారు. దీంతో ఒక్క టచ్‌తో ఫోన్ ఇట్టే ఓపెన్ అయిపోతుంది.

నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్..

Advertisement

చాలామందికి గేమ్స్ ఆడుతున్నప్పుడు బ్యాటరీ అయిపోతుందన్న భయం ఉంటుంది. అందుకే వన్‌ప్లస్ ఈ ఫోన్‌లో 8,500mah బ్యాటరీని అమర్చింది. దీనికి తోడు 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండటం వలన తక్కువ టైమ్‌లో ఛార్జింగ్ ఎక్కిపోతుంది. ఇకపోతే కెమెరాల విషయానికి వస్తే.. వెనుక 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ముందు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే ప్లస్ కీ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని మనకు నచ్చిన షార్ట్‌కట్ కోసం సెట్ చేసుకోవచ్చు.

గేమింగ్ ఫోన్స్‌లో ఇదో కొత్త ట్రెండ్..

మిగతా గేమింగ్ ఫోన్లలా ఇది చూడటానికి వింతగా ఉండదు. మామూలు స్మార్ట్‌ఫోన్‌లాగే ఉంటూనే, గేమింగ్ కావాలనుకున్నప్పుడు కంట్రోలర్ తగిలించుకుని వాడుకోవచ్చు. ప్రస్తుతానికి చైనాలో లాంచ్ అవుతున్న ఈ ఫోన్, మన మొబైల్ గేమింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేయడం ఖాయం. ముఖ్యంగా పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్, ఆ కంట్రోలర్ ఒక వరమనే చెప్పాలి.

Also Read: పర్పుల్ లుక్‌, 10,000mAh భారీ బ్యాటరీ.. అబ్బా ఏముంది మావా ఈ Vivo Y600 Pro స్మార్ట్‌ఫోన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×