// // Oneplus 15T: ఇప్పటివరకు రాని ఫీచర్లతో వన్ ప్లస్ న్యూ ఫోన్ లాంచ్ -->
E-Paper
Advertisement

Oneplus 15T: టెక్ మార్కెట్‌లో సెన్సేషన్.. ఇప్పటివరకు రాని ఫీచర్లతో వన్ ప్లస్ న్యూ ఫోన్ లాంచ్ !

Oneplus 15T:   టెక్ మార్కెట్‌లో సెన్సేషన్.. ఇప్పటివరకు రాని ఫీచర్లతో వన్ ప్లస్ న్యూ ఫోన్ లాంచ్ !
Advertisement

Oneplus 15T: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ‘వన్ ప్లస్’ అంటేనే ఒక క్రేజ్. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు ప్రీమియం లుక్స్‌కు పెట్టింది పేరు. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న OnePlus 15T కి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ ‘వైట్ కలర్’ డిజైన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత మోడల్స్ కంటే భిన్నంగా.. మరింత క్లాసీగా కనిపిస్తున్న ఈ ఫోన్ డిజైన్ చూస్తుంటే.. వన్ ప్లస్ మళ్ళీ తన పాత వైభవాన్ని వెనక్కి తెస్తున్నట్లు అనిపిస్తోంది.

OnePlus 15T వైట్ కలర్ డిజైన్ – ట్రెండింగ్ అప్‌డేట్స్:
ప్రతి ఏటా వన్ ప్లస్ తన ‘T’ సిరీస్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈసారి రాబోతున్న OnePlus 15T విషయంలో కంపెనీ డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల లీక్ అయిన ఫోటోలు , రెండర్స్ ప్రకారం, వైట్ కలర్ వేరియంట్ ఈ ఫోన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Advertisement

డిజైన్ హైలైట్స్:
లీక్ అయిన సమాచారం ప్రకారం,.. ఈ వైట్ కలర్ వేరియంట్ కేవలం రంగు మాత్రమే కాదు.. ఒక ప్రత్యేకమైన ఫినిషింగ్‌తో వస్తోంది. ఈ ఫోన్ వెనక భాగం గ్లాస్ ఫినిష్‌తో ఉన్నప్పటికీ.. వేలిముద్రలు పడకుండా ప్రత్యేక కోటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కెమెరా మాడ్యూల్:
OnePlus 15T లో కెమెరా సెటప్ కూడా చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. గతంలో సర్క్యులర్ డిజైన్ చూశాం. కానీ ఈసారి కెమెరా ఐలాండ్‌ను బాడీ కలర్‌తో సింక్ చేస్తూ.. సిల్వర్ అంచుల తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఫోన్‌కు చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. ‘హ్యాసిల్ బ్లాడ్’బ్రాండింగ్‌తో వచ్చే ఈ కెమెరా సెటప్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి పండగే అని చెప్పాలి.

Advertisement

స్పెసిఫికేషన్లు:
డిజైన్‌తో పాటు లోపల పవర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇందులో లేటెస్ట్ Snapdragon 8 Gen 5 ఉండే అవకాశం ఉంది.

డిస్‌ప్లే: 6.78 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఛాన్స్ ఉంది.

బ్యాటరీ: 5500mAh నుంచి 6000mAh బ్యాటరీతో పాటు 150W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చు.

సాఫ్ట్‌వేర్: ఆక్సిజన్ OS (OxygenOS) లేటెస్ట్ వెర్షన్‌తో క్లీన్ అండ్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

యూత్ క్రేజ్:
సాధారణంగా వైట్ కలర్ ఫోన్లు చాలా రిచ్‌గా కనిపిస్తాయి. వన్ ప్లస్ 15T లో ఈ వైట్ వేరియంట్‌ను మెటాలిక్ ఫ్రేమ్‌తో కలిపి ఇవ్వండి వల్ల ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా క్లాసీగా అనిపిస్తుంది. ముఖ్యంగా యువతను, టెక్ లవర్స్‌ను ఆకట్టుకోవడానికి ఈ కలర్ ఛాయిస్ పర్ఫెక్ట్ అని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: ఇన్‌స్టా రీల్స్ వైరల్ అయ్యే సీక్రెట్ హ్యాక్స్.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ సెట్టింగ్స్ ఇవే!

ధర :
ప్రస్తుతానికి ఇవన్నీ ప్రాథమిక విషయాలు మాత్రమే. అధికారికంగా వన్ ప్లస్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ.. మార్చి చివర్లో లేదా ఎప్రిల్‌లో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.55,000 నుంచి రూ. 65,000 మధ్య ఉండొచ్చని అంచనా.

స్మార్ట్‌ఫోన్ కేవలం ఫీచర్స్ కోసమే కాదు. ఒక స్టేటస్ సింబల్ లాగా కూడా మారిపోయింది. OnePlus 15T వైట్ కలర్ డిజైన్ ఆ స్టేటస్‌ను పెంచేలాగే ఉంది. పర్ఫార్మెన్స్‌లో కింగ్ అనిపించుకునే వన్ ప్లస్, ఇప్పుడు లుక్స్‌లో కూడా నంబర్ వన్ అనిపించుకోవడానికి సిద్ధమవుతోంది. ఒకవేళ మీరు కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉంటే.. ఈ వైట్ బ్యూటీ కోసం మరికొంత కాలం వెయిట్ చేయడం మంచిదే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×