E-Paper
Advertisement

OnePlus 15R Smartphone: అబ్బురపరిచే ఫీచర్లతో వన్‌ఫ్లస్ న్యూ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్లు తెలిస్తే షేకైపోతారు బాసూ!

OnePlus 15R Smartphone: అబ్బురపరిచే ఫీచర్లతో వన్‌ఫ్లస్ న్యూ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్లు తెలిస్తే షేకైపోతారు బాసూ!
Advertisement

OnePlus 15R Smartphone: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ రంగంలోకి దిగనుంది. వన్‌ప్లస్ 15R పేరుతో మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లో విడుదల కానుందని కంపెనీ పేర్కొంది. వన్‌ఫ్లస్ యూజర్లను ఆకట్టుకునేలా, అధునాతన ఫీచర్లతో రాబోతున్న వన్‌ఫ్లస్ 15R స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరా, ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి. మరి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధరెంత.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా.

ఎప్పుడు విడుదల కానుంది?

OnePlus 15R స్మార్ట్‌ఫోన్..‌ భారత్ మార్కెట్‌లో డిసెంబరు 17వ తేదీన విడుదల కానుందని సంస్థ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ గత నెలలో చైనాలో విడుదలైన OnePlus Ace 6 మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌లా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. OnePlus ఇండియా కూడా ఈ హ్యాండ్‌సెట్‌ గురించి కొన్ని వివరాలను పంచుకుంది.

Advertisement

Read Also: రెడ్‌మీ ప్రియులకు క్రేజీ అప్డేట్.. బడ్జెట్ ధరలోనే కొత్తఫోన్ లాంచ్‌కు రంగం సిద్ధం!

ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే:

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో విడుదల కానుంది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌లో ఆక్సిజన్ OS 16తో పనిచేస్తుంది. అంతేకాదు.. 50MP OIS ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 16MP సెల్పీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ స్టోరేజ్ 7,800 – 8,000mAh మధ్య ఉండవచ్చు. అలాగే ఇది 100W–120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌, NFC, డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో రానుంది. 6.83-అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్.. 165Hz రిప్రెష్ రేట్‌తో 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుందని అంచనా. అలాగే OnePlus 15R స్మార్ట్‌ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP68, IP69 సర్టిఫికేట్లు పొందవచ్చు.

కెమెరా విషయానికొస్తే..

Advertisement

ఈ OnePlus 15R స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్, 50MP సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వన్‌ప్లస్ NFC, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే ఈ ఫోన్ OnePlus 15 మాదిరిగానే ఉంటుంది. ఈ డివైస్ ఫ్లాట్ ఫ్రేమ్, స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌తో రావచ్చు. ఈ వన్‌ఫ్లస్ 15R ఫోన్ సుమారు రూ. 44,999 ధరతో ప్రారంభం కావచ్చని అంచనా. అయితే, ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర గురించి సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also: భారత మార్కెట్లోకి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ లైఫ్, AI కెమెరాతో పిచ్చ క్లారిటీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×