E-Paper
Advertisement

Oneplus 13R Launch Date : వన్ ప్లస్ 13 లాంఛ్ డేట్ లీక్.. పెద్ద బ్యాటరీతో పాటు హై స్టోరేజ్.. ఇంకా ఎన్నో పిచ్చెక్కించే ఫీచర్స్!

Oneplus 13R Launch Date : వన్ ప్లస్ 13 లాంఛ్ డేట్ లీక్.. పెద్ద బ్యాటరీతో పాటు హై స్టోరేజ్.. ఇంకా ఎన్నో పిచ్చెక్కించే ఫీచర్స్!
Advertisement

Oneplus 13R Launch Date : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వన్ ప్లస్ త్వరలోనే రెండు మొబైల్స్ ను లాంఛ్ చేయనుంది. వన్‌ప్లస్‌ తీసుకురాబోతున్న ఈ మెుబైల్స్ లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతున్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అంటూ టెక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మొబైల్ లాంఛింగ్ డేట్, స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలివే.

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus ) నుంచి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల కానున్నాయి. వన్‌ప్లస్‌ 13, 13R పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వన్‌ప్లస్‌ 13R మెుబైల్ తొలుత చైనా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. చైనాలో వన్‌ప్లస్ Ace 5 పేరుతో లాంఛ్ కానుంది అనంతరం భారత్ లో విడుదల కాబోతన్నాయి. అయితే ఇప్పటికే వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 13R Smartphone) హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన డిటెయిల్స్ లీక్ అయ్యి స్మార్ట్ ప్రియులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ మెుబైల్ డిసెంబర్ లో చైనా లో లాంఛ్ కాగా, జనవరిలో భారత్ లో రాబోతుంది. గత ఏడాది భారత్‌లో వన్‌ప్లస్‌ 12, 12R స్మార్ట్‌ఫోన్‌లు జనవరి నెలలో ఒకేసారి విడుదలయ్యాయి. ఈ తరహాలోనే వన్‌ప్లస్ 13, 13R హ్యాండ్‌సెట్‌లు కూడా లాంఛ్ కానున్నాయని తెలుస్తోంది.

Advertisement

వన్‌ప్లస్‌ 13R స్పెసిఫికేషన్స్ – ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ కస్టమర్స్ సౌకర్యార్ధం కొత్త మెుబైల్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. అయితే వన్ ప్లస్ తాజాగా తీసుకొస్తున్న ఈ మెుబైల్స్ లో బ్యాటరీ ఎక్కువ కెపాసిటీని కలిగి ఉండనుంది. దీంతో తక్కువ టైమ్ లోనే ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రయాణాలు ఎక్కుగా చేసే వారికి సైతం ఈ మెుబైల్ బెస్ట్ ఆప్షన్. ఇక వన్‌ప్లస్‌ 13R మెుబైల్స్ 1.5K రిజల్యూషన్‌ డిస్‌ప్లే, హై బ్యాటరీ కెపాసిటీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ తో రాబోతున్నాయి.

ప్రాసెసర్ – ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో రాబోతుంది.

Advertisement

డిస్ ప్లే – ఇక 6.78 అంగాళాల BOE X2 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉండనుంది.

కెమెరా – వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 50MP సూపర్ టెలిఫోటో, 32MP సెల్ఫీ కెమెరా సైతం ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాతో సైతం 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఫోన్ ఫ్రంట్ – బ్యాక్ కెమెరాతో 4K Dolby Vision వీడియోలు షూట్ చేసే ఛాన్స్ ఉంది.

బ్యాటరీ సహా ఫాస్ట్‌ ఛార్జింగ్ – స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించే యూజర్లుకు సౌకర్యంగా ఉండేందుకు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో ఈ మెుబైల్ రాబోతుంది. 6000mAh బ్యాటరీతో పాటు అల్ట్రా ఫస్ట్ కేహార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉండనుంది.

సెక్యూరిటీ –  ఇందులో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్, 6.82 అంగుళాల AMOLED స్క్రీన్ ఉంది.

స్టోరేజ్ – ఈ మెుబైల్ హై స్టోరేజ్ తో రాబోతుంది. ఇందులో రామ్ ను 24 GB వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ALSO READ : ఫోన్ దొంగలించి సిమ్ తీసేసినా ఈజీగా ట్రాక్ చేయెుచ్చని తెలుసా.. జస్ట్ ఈ సెట్టింగ్స్ మార్చేస్తే స్విచ్చాఫ్ కూడా చేయలేరు

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×