E-Paper
Advertisement

Old Smartphone Reuse: ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. మూలనపడ్డ పాత మొబైల్‌ను 5 రకాలుగా వాడుకోవచ్చు!

Old Smartphone Reuse: ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. మూలనపడ్డ పాత మొబైల్‌ను 5 రకాలుగా వాడుకోవచ్చు!
Advertisement

Old Smartphone Reuse: చాలామంది కొత్త ఫోన్ కొనగానే.. పాత ఫోన్‌ను ఏదో ఒక మూల పడేస్తారు లేదా బీరువాలో పెట్టి మర్చిపోతుంటారు. మరికొందరైతే అప్పనంగా తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. కానీ ఫోన్ పాతదైతేనేం.. అందులో ఫీచర్లు అలాగే ఉంటాయి కదా! కొంచెం తెలివిగా ఆలోచిస్తే.. ఆ పాత ఫోన్‌ను మన రోజువారీ అవసరాలకు అద్భుతమైన సాధనంగా వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

సీసీటీవీ కెమెరాగా:

ఇంటి భద్రత కోసం వేల రూపాయలు పెట్టి సీసీటీవీ కెమెరాలు కొనక్కర్లేకుండా, మీ పాత ఫోన్‌నే సెక్యూరిటీ కెమెరాగా మార్చేయొచ్చు. ప్లే స్టోర్‌లో దీని కోసం కొన్ని మంచి యాప్స్ ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసి, వై-ఫైకి కనెక్ట్ చేస్తే చాలు. ఆ ఫోన్‌ను ఒక చోట సెట్ చేస్తే, మీరు ఎక్కడున్నా మీ ఇంటిని ఫోన్‌లోనే చూసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఈ పద్ధతిని పాటించొచ్చు.

డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌గా:

Advertisement

మన ఫోన్లలో వేలకొద్దీ ఫొటోలు, జ్ఞాపకాలు ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడో ఒకసారి తప్ప చూడనే చూడం. అందుకే, మీ పాత ఫోన్‌ను ఒక స్టాండ్‌ మీద పెట్టి, స్లైడ్‌షో ఆన్ చేయండి. అది ఒక అందమైన డిజిటల్ ఫొటో ఫ్రేమ్‌లా మారిపోతుంది. మీ హాల్లోనో లేదా బెడ్ రూంలోనో పెట్టుకుంటే, పాత జ్ఞాపకాలు కళ్లముందే కదలాడుతూ భలే సంతోషాన్నిస్తాయి.

Also Read: అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సోలార్ పవర్ బ్యాంక్స్.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే!

కార్ నెవిగేషన్ కోసం:

Advertisement

కారులో వెళ్లేటప్పుడు మ్యాప్స్ చూడటానికి మన మెయిన్ ఫోన్‌ వాడితే బ్యాటరీ టక్కున అయిపోతుంది. మధ్యలో కాల్స్ వస్తే డ్రైవింగ్ చేసేటప్పుడు చిరాగ్గా ఉంటుంది. అందుకే, పాత ఫోన్‌ను కేవలం మ్యాప్స్ కోసమే వాడండి. అందులో మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసి కారులోనే ఉంచేస్తే, మీ మెయిన్ ఫోన్ బ్యాటరీ ఆదా అవుతుంది.. మీకు కాల్స్ వచ్చినా డ్రైవింగ్‌లో డిస్టర్బెన్స్ ఉండదు.

మ్యూజిక్ ప్లేయర్‌గా:

పాత ఫోన్‌ను ప్యూర్ మ్యూజిక్ ప్లేయర్‌లా వాడుకోవచ్చు. పాటలు, పాడ్‌కాస్ట్‌లు అన్నీ అందులోనే ఉంచుకుని బ్లూటూత్ స్పీకర్‌కి కనెక్ట్ చేయండి. దీనివల్ల మీ మెయిన్ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్ల గోల లేకుండా హాయిగా మ్యూజిక్ వినొచ్చు. అంతేకాదు, పాటల వల్ల మీ మెయిన్ ఫోన్‌లో స్టోరేజ్ నిండిపోయే తలపోటు కూడా తప్పుతుంది.

పిల్లలకు లెర్నింగ్ గ్యాడ్జెట్:

పిల్లలకు ఫోన్ అలవాటు చేయడం అంత మంచిది కాకపోయినా.. చదువు కోసం వాడటంలో తప్పులేదు. పాత ఫోన్‌లో ఉన్న అనవసరమైన యాప్స్ అన్నీ తీసేసి, కేవలం వాళ్ల చదువుకు సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంచి వాళ్లకు ఇవ్వొచ్చు. దీనివల్ల వాళ్లు కొత్త విషయాలు నేర్చుకుంటారు, పైగా మీ మెయిన్ ఫోన్‌లోని పర్సనల్ డేటా డిలీట్ అయిపోతుందనే భయం కూడా ఉండదు.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 4 మార్పులు కనిపిస్తే.. దాని బ్యాటరీ పని అయిపోయినట్టే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×