E-Paper
Advertisement

Ola: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25 వేల తగ్గింపు.. ఈ మోడళ్లపైనే..?

Ola: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25 వేల తగ్గింపు.. ఈ మోడళ్లపైనే..?
Advertisement

Ola: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. రోజుకో కొత్త మోడల్ మార్కెట్‌లోకి దర్శనమిస్తూ వాహనప్రియులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో మోడళ్లను ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తీసుకువచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో ఓలా ఎలక్ట్రిక్ ఒకటి.

అతి తక్కువ కాలంలోనే ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో అగ్రగామిగా స్థానం సంపాదించుకుంది. ఈ స్కూటర్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అయితే ధర ఎక్కువగా ఉండటంతో కొందరు ఈ స్కూటర్‌ను కొనేందుకు వెనకడుగువేస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.

Advertisement

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర తగ్గితే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా?. అయితే అలాంటి సమయం వచ్చేసింది. తాజాగా ఈ స్కూటర్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: హీరో మోటోకార్ప్ నుంచి మరో స్టైలిష్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..?

Advertisement

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను ఫిబ్రవరి నెలలో తగ్గిస్తున్నట్లు రీసెంట్‌గా ప్రకటించింది. ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ఎక్స్ ప్లస్ వంటి మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. దాదాపు రూ.25 వేల వరకు ధరలు తగ్గాయి.

S1 Pro:

ఎస్ 1 ప్రో అసలు ధర ఇప్పటి వరకు రూ.1,47,499గా ఉంది. అయితే రూ.17,500 తాజా తగ్గింపుతో ఈ స్కూటర్‌ను రూ.1,29,999 లకు సొంతం చేసుకోవచ్చు.

S1 Air:

ఎస్ 1 ఎయిర్ స్కూటర్ అసలు ధర ఇప్పటి వరకు రూ.1,19,999 గా ఉంది. అయితే దీనిపై రూ.15,000 తాజా తగ్గింపుతో ఇప్పుడు రూ.1,04,999 లకు కొనుక్కోవచ్చు.

S1 X+ (3kWh):

3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎస్ 1 ఎక్స్ ప్లస్ స్కూటర్ అసలు ధర రూ.1,09,999 గా ఉంది. అయితే ఈ స్కూటర్‌పై గరిష్టంగా రూ.25,000 భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత రూ.84,999 కు దీనిని సొంతం చేసుకోవచ్చు.

కంపెనీ ఈ డిస్కౌంట్లను ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×