E-Paper
Advertisement

UPI Offline: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్.. జస్ట్ ఇలా *99# డయల్ చేస్తే చాలు

UPI Offline: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్.. జస్ట్ ఇలా *99# డయల్ చేస్తే చాలు
Advertisement

UPI Offline: డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ అనేది భారతదేశంలో రోజువారీ అవసరంగా మారింది. కిరాణా షాప్ దగ్గర నుంచి పెద్ద లావాదేవీల వరకూ యూపీఐ పేమెంట్ లేకుండా రోజు గడవని పరిస్థితి. కానీ నెట్‌వర్క్ లేని ప్రాంతాలు, డేటా అయిపోయిన సందర్భాలు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో యూపీఐ పనిచేయకపోతే ఇబ్బంది తప్పదు. అలాంటి సందర్భాల్లో ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే ఆఫ్లైన్ యూపీఐ సేవ చాలా ఉపయోగపడుతుంది. ఈ సేవ ద్వారా సాధారణ కాల్‌లా *99# డయల్ చేసి యూపీఐ పేమెంట్ చేయొచ్చు.

ఆఫ్లైన్ యూపీఐ అంటే ఏమిటి

Advertisement

ఆఫ్లైన్ యూపీఐ అనేది యూఎస్‌ఎస్‌డీ ఆధారంగా పనిచేసే యూపీఐ పేమెంట్ విధానం. దీనికి మొబైల్ డేటా అవసరం లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సేవను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 83 బ్యాంకులు, 4 టెలికాం కంపెనీల సహకారంతో ఈ సేవ అందుబాటులో ఉంది. 13 భాషల్లో ఉపయోగించే అవకాశం ఉండటం వల్ల ప్రతి ఒక్కరికీ ఇది సులభంగా మారింది.

*99# యూపీఐ పేమెంట్ నంబర్ ప్రత్యేకత

Advertisement

*99# డయల్ చేస్తే మీ మొబైల్ స్క్రీన్‌పై ఇంటరాక్టివ్ మెనూ వస్తుంది. అందులో పేమెంట్ పంపడం, బ్యాలెన్స్ చెక్ చేయడం లాంటి ఆప్షన్లు ఉంటాయి. ఈ విధానంలో ఒక్కో లావాదేవీ గరిష్ట పరిమితి రూ.5000 మాత్రమే. ఈ సేవను ఉపయోగించిన ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.0.50 చార్జ్ ఉంటుంది.

Also Read: Samsung Galaxy Z Fold 6: రూ. 1.65 లక్షల ఫోన్ ఇప్పుడు లక్షకే.. అమెజాన్‌లో శామ్‌సంగ్ క్రేజీ ఆఫర్

ఆఫ్లైన్ యూపీఐ సెటప్ ఎలా చేయాలి

ఆఫ్లైన్ యూపీఐ ఉపయోగించాలంటే ముందుగా యాక్టివేషన్ అవసరం. ఫోన్ డయలర్ ఓపెన్ చేసి *99# డయల్ చేయాలి. మొదట మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. తర్వాత మీ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదు చేయాలి. అదే మొబైల్ నంబర్‌తో లింక్ అయిన ఖాతాలు కనిపిస్తాయి. అందులో కావాల్సిన ఖాతా ఆప్షన్ ఎంచుకోవాలి. భద్రత కోసం డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలు, ఎక్స్‌పైరీ తేదీ అడుగుతారు. ఈ వివరాలు సరిగ్గా ఇచ్చిన తర్వాత ఆఫ్లైన్ యూపీఐ యాక్టివేట్ అవుతుంది.

ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలి

పేమెంట్ చేయాలంటే మళ్లీ *99# డయల్ చేయాలి. మెనూలో డబ్బు పంపండి అనే ఆప్షన్ కోసం 1 ఎంచుకోవాలి. ఆ తర్వాత రిసీవర్ యూపీఐ ఐడి లేదా యూపీఐకి లింక్ అయిన మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌తో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదు చేయాలి. పంపాల్సిన మొత్తం టైప్ చేయాలి. ఈ మొత్తం రూ.5000 లోపు ఉండాలి. చివరగా యూపీఐ పిన్ ఇవ్వగానే లావాదేవీ పూర్తవుతుంది. కొన్ని సెకన్లలోనే పేమెంట్ సక్సెస్ మెసేజ్ వస్తుంది.

ఆఫ్లైన్ యూపీఐ ఉపయోగం

ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో, నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న చోట్ల, డేటా అయిపోయిన సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో *99# ఆఫ్లైన్ యూపీఐ ఒక నమ్మకమైన పరిష్కారంగా మారింది. చిన్న మొత్తాల చెల్లింపులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వృద్ధులు, స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా ఉపయోగించని వారు ఈ విధానంతో సులభంగా యూపీఐ పేమెంట్ చేయవచ్చు. పరిమితి తక్కువగా ఉన్నా, అవసరమైన సమయంలో డబ్బు పంపేందుకు ఈ సేవ ఎంతో సహాయపడుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×