E-Paper
Advertisement

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!
Advertisement

Offline UPI: ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లోనూ యూపీఐ (UPI) చెల్లింపులు చేసేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) ఉపయోగించుకొని రూ.2000 వరకూ ఆఫ్ లైన్ పేమేంట్స్ జరిగేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు బిజినెస్ స్టాండర్డ్ రాసుకొచ్చిన కథనం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఇంతకి ఇది ఎలా పనిచేస్తుందో ఈ కథనంలో చూద్దాం.

ఇది ఎలా పనిచేస్తుంది?

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. ఈ కొత్త విధానం పూర్తిగా ఎన్ఎఫ్‌సీ (NFC) సాంకేతికత ఆధారంగా పనిచేయనుంది. వినియోగదారులు ఇంటర్నెట్ ఉన్నప్పుడే తమ యూపీఐ లైట్ (UPI Lite) వాలెట్‌లో కొంత డబ్బును సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో సదరు వ్యాపారి వద్ద ఉన్న పీఓఎస్ (Pos) మిషన్‌పై ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా రూ.2,000 వరకు చెల్లించవచ్చు. ఇందుకోసం ఎలాంటి యూపీఐ పిన్ (UPI PIN) నమోదు చేయాల్సిన అవసరం లేదు. నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు సదరు మిషన్ ఆ పేమెంట్ వివరాలను భద్రపరుచుకుని.. తిరిగి ఇంటర్నెట్ కనెక్టివిటీ రాగానే సర్వర్‌కు పంపి వేరిఫై చేయనుంది.

క్రెడిట్, డెబిట్ కార్డ్ తరహాలో..

Advertisement

ఎన్‌పీసీఐ ఇప్పటికే 2023 సెప్టెంబర్ లో ‘యూపీఐ లైట్ ఎక్స్’ పేరుతో ఆఫ్‌లైన్ చెల్లింపులను పరిచయం చేసింది. అయితే అది కేవలం స్మార్ట్‌ఫోన్ల మధ్య లేదా ప్రత్యేక ఆఫ్‌లైన్ క్యూఆర్, సౌండ్‌బాక్స్‌ల వద్ద మాత్రమే పనిచేసేది. కానీ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న కొత్త ఫీచర్ ద్వారా దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం వాడే పీఓఎస్ (POS) మిషన్లలో కూడా ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్లను యాక్సెప్ట్ చేసేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

ఆర్బీఐ పరిమితి రూ.500 మాత్రమే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుత నిబంధనల ప్రకారం.. సాధారణ ఆఫ్‌లైన్ డిజిటల్ లావాదేవీలకు పరిమితి రూ.500గా ఉంది. అయితే త్వరలో తీసుకురానున్న ఈ కొత్త విధానంలో ఒక్కో లావాదేవీకి పరిమితిని రూ.2,000 వరకు పెంచుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీనిపై ఎన్‌పీసీఐ త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయెుచ్చని సమాచారం. ఇక ఈ ఆఫ్‌లైన్ విధానంలో పేమెంట్ కంప్లీట్ చేస్తే వెంటనే మెసేజ్ రాదు. నెట్‌వర్క్ వచ్చి డేటా ప్రాసెస్ అయిన తర్వాతే కస్టమర్‌కు SMS వెళ్లనుంది.

Advertisement

Also Read: సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

పెరుగుతున్న యూపీఐ వినియోగం

ఇదిలా ఉంటే దేశంలో రోజు రోజుకు యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి నెలా వందల నుంచి రూ.వేల కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు విమాన ప్రయాణాలు, దేశీయ రవాణా వ్యవస్థల్లో కార్డు చెల్లింపులలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి ఈ ఆఫ్‌లైన్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×