E-Paper
Advertisement

Ear Buds from Nothing: నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అంటారు

Ear Buds from Nothing: నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అంటారు
Advertisement
Nothing ear Buds
Nothing ear Buds

Nothing Launching Ear Buds on April 18th: లండన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నథింగ్‌ మార్కెట్‌లో కొంతకాలం క్రితం తన తాజా స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 2(ఎ)ని విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఇయర్‌బడ్స్ నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ (ఎ)లను ఏప్రిల్ 18న విడుదల చేయబోతోంది. ఈ ఇయర్‌బడ్‌లతో దాని ఆడియో లైనప్ పేరులో కొన్ని మార్పులు చేయనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ తీసుకొస్తున్న నథింగ్ ఇయర్ టాప్-ఎండ్ వేరియంట్, నథింగ్ ఇయర్ ఎ అనే రెండు మోడల్స్ ఉన్నాయి. నథింగ్ ఇయర్ ధర సుమారు రూ. 13,500గా ఉండనుంది. ఇది బ్లాక్, వైట్ కలర్స్ వేరియంట్‌లలో రానుంది. నథింగ్ ఇయర్ (ఎ) ధర దాదాపు రూ. 9,000గా ఉంది.

Advertisement

Also Read: శ్యామ్‌సంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్

నథింగ్ ఇయర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. ఇది డ్యూయల్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇయర్‌బడ్స్  IP54 రేటింగ్‌తో రావచ్చు. అయితే కేస్ IPX2 రేటింగ్‌తో రావచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడితే.. నథింగ్ ఇయర్‌లో ANC ఫీచర్ ఆఫ్ చేస్తే ఏడున్నర గంటల పాటు బ్యాటరీ ఇస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 33 గంటల బ్యాటరీ కెపాసటీ ఇస్తుంది. ఈ కేస్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇయర్‌బడ్స్ 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటలు ప్లే బ్యాక్ ఇస్తాయి. ఇవి బ్లాక్, వైట్, ఎల్లో కలర్ వేరియంట్‌లో వస్తాయి.

Advertisement

Also Read: రెడ్ మీ నుంచి 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్స్ అదుర్స్!

నథింగ్ ఇయర్ (ఎ) ఎల్లో వెర్షన్ ఎకో ఫ్రెండ్లీ డిజైన్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.  నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఎ మధ్య ఒకే ఒక తేడా ఉంది. ఈ రెండిటిలో IP రేటింగ్, బ్యాటరీ లైఫ్ వేరుగా ఉంటుంది. నథింగ్ ఇయర్ (ఎ) ANC, డ్యూయల్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే.. ఈ ఇయర్‌ఫోన్‌లు ANC లేకుండా ఎనిమిది గంటల ప్లేబ్యాక్ ఇస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 38 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×