E-Paper
Advertisement

ఇక కేబుల్స్ అవసరం లేదు.. Nothing Warp యాప్‌తో నిమిషాల్లో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

ఇక కేబుల్స్ అవసరం లేదు.. Nothing Warp యాప్‌తో నిమిషాల్లో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!
Advertisement

Nothing Warp App: ఐఫోన్ వాడుతున్న వాళ్లు తమ మ్యాక్ ల్యాప్‌టాప్‌లకు ఫైల్స్ పంపించుకోవాలంటే ‘ఎయిర్ డ్రాప్‌’తో ఎంత స్పీడ్‌గా పని ముగించేస్తారో మనకు తెలిసిందే. అదే మన ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఫోన్ నుంచి కంప్యూటర్‌కు ఒక ఫొటో పంపించుకోవాలన్నా కచ్చితంగా కేబుల్ కనెక్ట్ చేసుకోవడమో, మెయిల్ చేసుకోవడమో చేయాలి. ఈ కష్టాలకు చెక్ పెడుతూ కార్ల్ పీకి చెందిన ‘నథింగ్’ కంపెనీ Nothing Warp యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ నుండి మ్యాక్, విండోస్, ఇలా దేనికైనా సరే ఇక ఈజీగా ఫైల్స్ సెండ్ చేసుకోవచ్చు.

ఇదెలా పనిచేస్తుంది? 

Nothing Warp కేవలం యాప్ మాత్రమే కాదు.. ఇది ఒక వెబ్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌తో కలిపి పనిచేస్తుంది. దీని కోసం మన ఫోన్‌లో ఈ యాప్ ఉండాలి. మన కంప్యూటర్ బ్రౌజర్ (క్రోమ్ వంటివి)లో చిన్న ఎక్స్‌టెన్షన్ కూడా ఉండాలి. ఈ యాప్ ద్వారా కేవలం ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు.. మన ఫోన్‌లో కాపీ చేసిన టెక్స్ట్‌ను కూడా నేరుగా కంప్యూటర్‌లో పేస్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకున్నా.. ఈ స్కోడా ‘డ్యూయోబెల్’ సౌండ్ వినిపించాల్సిందే!

డేటా భద్రత సంగతేంటి?

చాలామందికి వచ్చే డౌట్ ఏమిటంటే.. మా ఫైల్స్ వీళ్ల సర్వర్లలోకి వెళ్తాయా అని? అస్సలు భయం లేదు. నథింగ్ కంపెనీ ఏం చెప్పిందంటే.. ఈ ఫైల్స్ అన్నీ మీ సొంత గూగుల్ డ్రైవ్ ద్వారానే వెళ్తాయి. దీంతో మీ డేటా మీ చేతుల్లోనే ఉంటుంది. నథింగ్ సర్వర్లలో మీ ఫొటోలు కానీ, డాక్యుమెంట్లు కానీ ఎక్కడా సేవ్ అవ్వవు. మనం రెగ్యులర్‌గా వాడే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయితే సరిపోతుంది కాబట్టి ప్రైవసీకి డోకా లేదు.

వాడటం చాలా సింపుల్..

Advertisement

గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక.. ఫోన్‌లో ఏదైనా ఫైల్ ఓపెన్ చేసి షేర్ బటన్ నొక్కగానే అక్కడ Nothing Warp యాప్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు, ఆ ఫైల్ నేరుగా కంప్యూటర్ బ్రౌజర్‌లోకి వచ్చేస్తుంది. కంప్యూటర్ నుంచి ఫోన్‌కు పంపాలన్నా అంతే ఈజీ. ఈ యాప్ చాలా లైట్ వెయిట్, కాబట్టి ఫోన్ హ్యాంగ్ అవుతుందనే భయం వద్దు. ఆండ్రాయిడ్ వాడుతూ మ్యాక్ లేదా విండోస్ వాడేవారికి ఇది నిజంగా మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు.

Also Read: అత్యాధునిక ఫీచర్లతో Xiaomi Mini LED TVs.. ఇలాంటి డిస్‌ప్లే కోసం ఆస్తులైనా అమ్మేసుకోవచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×