E-Paper
Advertisement

రెడ్ కలర్‌లో Nothing సరికొత్త ఫోన్.. RCB లోగోతో క్రేజీ లుక్.. ఆ ఒక్క స్టోర్‌లోనే లభ్యం!

రెడ్ కలర్‌లో Nothing సరికొత్త ఫోన్.. RCB లోగోతో క్రేజీ లుక్.. ఆ ఒక్క స్టోర్‌లోనే లభ్యం!
Advertisement

Nothing Phone 4b RCB Edition: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్.. భారత మార్కెట్లోకి తమ సరికొత్త బడ్జెట్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ 4b’ని తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ప్రత్యేకంగా క్రికెట్ అభిమానుల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్పెషల్ ఎడిషన్‌ను కూడా అదే రోజున విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ డిజైన్, కలర్ వివరాలు లాంచ్‌కు ముందే బయటకు వచ్చాయి.

బెంగళూరు స్టోర్‌లో ప్రత్యేక సేల్:

ఈ సరికొత్త నథింగ్ ఫోన్ 4b ఆర్‌సీబీ ఎడిషన్ జూలై 7న మధ్యాహ్నం 3:30 గంటలకు భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. విడుదలైన వెంటనే.. బెంగళూరులోని నథింగ్ అధికారిక బ్రాండెడ్ స్టోర్‌లో సాయంత్రం 4 గంటల నుండి ఒక ప్రత్యేక సేల్ (డ్రాప్ ఈవెంట్) ద్వారా ఇది కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ఇవి చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నందున, ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన విక్రయించనున్నారు.

ఆకట్టుకునే ఆర్‌సీబీ థీమ్ డిజైన్:

Advertisement

ఈ స్పెషల్ ఎడిషన్ డిజైన్ సాధారణ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ.. ఆర్‌సీబీ అభిమానులను ఆకట్టుకునేలా కొన్ని కీలక మార్పులు చేశారు. ఫోన్ వెనుక భాగంలో మధ్యలో ఐపీఎల్ ఫ్రాంచైజీ RCB లోగోను ముద్రించారు. అలాగే, ఆర్‌సీబీ జెర్సీ రంగును ప్రతిబింబించేలా ఈ ఫోన్‌ను పూర్తిగా ఎరుపు (రెడ్) రంగులో డిజైన్ చేశారు. దీనికి అదనపు లుక్ ఇచ్చేలా పక్కన ఉండే ఫిజికల్ బటన్స్‌ను బ్లాక్ కలర్‌లో అందించారు.

నథింగ్, ఆర్‌సీబీ లీగ్ బంధం:

ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నథింగ్ సంస్థ జెర్సీ, టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ భాగస్వామ్యంలో భాగంగానే కంపెనీ తమ తొలి భారతీయ బ్రాండ్ స్టోర్‌ను కూడా బెంగళూరులోనే ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ప్రేమికులను టార్గెట్ చేస్తూ ఈ సరికొత్త కలెక్టబుల్ డివైజ్‌ను మార్కెట్లోకి తెస్తోంది.

ఫీచర్లు ఎలా ఉంటాయంటే?

Advertisement

సాధారణ నథింగ్ ఫోన్ 4b మోడల్ జూలై 7న లాంచ్ అయిన తర్వాత ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి రానుంది. ఈ ఫోన్ కనీసం బ్లూ కలర్ ఆప్షన్‌లో లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని నథింగ్ సంస్థ ధృవీకరించింది. తక్కువ బడ్జెట్లో వినూత్న డిజైన్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×