E-Paper
Advertisement

Nothing Phone 4a: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ.. ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తున్న నథింగ్ ఫోన్ 4a సిరీస్!

Nothing Phone 4a: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ.. ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తున్న నథింగ్ ఫోన్ 4a సిరీస్!
Advertisement

Nothing Phone 4a: టెక్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో నథింగ్ కూడా ఒకటి. ముఖ్యంగా ఆ కంపెనీకి గుర్తింపు తెచ్చిన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను Nothing Phone 4a సిరీస్‌లో Proలో సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో రానున్న ఈ ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల విజువల్స్ పరంగా చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. యువతను దృష్టిలో పెట్టుకుని గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లైటింగ్‌లో చేసిన మార్పులు ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. కేవలం మెరిసే లైట్లు మాత్రమే కాకుండా, నోటిఫికేషన్లు, కాల్స్ వచ్చినప్పుడు ఇవి ఇచ్చే ఎఫెక్ట్స్ యూజర్లకు విభిన్న అనుభూతిని కలిగిస్తాయి.

మెరుగైన పనితీరు:

ఈ ఫోన్ స్పీడ్ విషయంలో నథింగ్ తగ్గేదే లే అంటుంది. ఇది నథింగ్ ప్రో మోడల్ కాబట్టి.. మీడియాటెక్ లేదా స్నాప్‌డ్రాగన్ యొక్క శక్తివంతమైన చిప్‌సెట్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. 8GB, 12GB RAM ఆప్షన్లు ఉండటం వల్ల ఎక్కువగా గేమ్స్ ఆడే వారికి లేదా మల్టీటాస్కింగ్ చేసే వారికి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. అన్నిటి కంటే.. ముఖ్యంగా నథింగ్ ఓఎస్ ఇచ్చే క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవం ఆండ్రాయిడ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. అనవసరమైన యాప్స్ లేకుండా ఫోన్ చాలా వేగంగా స్పందిస్తుంది.

Advertisement

Also Read: మొబైల్ మార్కెట్ షేకైపోద్ది.. ఈ వారం లాంచయ్యే ఐఫోన్ 17e, పిక్సెల్ 10a ఫీచర్లివే!

ఏఐ ఫొటో ఎడిట్ ఫీచర్లు:

ఈ Nothing Phone 4aలో 50MP మెయిన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ అద్భుతమైన అవుట్‌పుట్ ఇస్తుందని అంచనా. తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫొటోలు తీయడంతో పాటు, ఏఐ ఫీచర్ల సాయంతో వాటిని ప్రొఫెషనల్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే, 5000mAh భారీ బ్యాటరీ ఉండటతో ఫోన్‌ను రోజంతా వాడుకోవచ్చు. దీనికి తోడు ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉండటం మరో ఆకర్షణ అనే చెప్పాలి.

ధర ఎంతంటే?

Advertisement

భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర సుమారు రూ.25,000 నుండి రూ.35,000 మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కోరుకునే వారికి, డిజైన్ పరంగా విభిన్నంగా ఉండాలనుకునే వారికి Nothing Phone 4a Pro సరైన ఎంపిక. త్వరలోనే ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో ఇది అందుబాటులోకి రానుంది.

Also Read: ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త, ఫ్రిడ్జ్ పేలిపోతుంది!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×