// // Nothing Phone 3a Lite: వచ్చేస్తోంది నథింగ్ ఫోన్ 3a లైట్! -->
E-Paper
Advertisement

Nothing Phone 3a Lite: వచ్చేస్తోంది నథింగ్ ఫోన్ 3a లైట్.. దీని స్పెషాలిటీ తెలిస్తే మైండ్ బ్లాకే!

Nothing Phone 3a Lite: వచ్చేస్తోంది నథింగ్ ఫోన్ 3a లైట్.. దీని స్పెషాలిటీ తెలిస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Nothing Phone 3a Lite: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నథింగ్ ఫోన్ ప్రియులకు తీపికబురు. భారతీయ మార్కెట్‌లోకి అధికారికంగా నథింగ్ బ్రాండ్ నుంచి సరికొత్త ఫోన్‌ను ఈనెల 27న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ పాపులర్ బడ్జెట్-ఫ్రెండ్లీ అవతార్ నథింగ్ ఫోన్ 3a లైట్ కొన్ని గంటల్లో మార్కెట్లోకి రానుండటంతో స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో జోష్ పెరిగింది. మరెందుకు ఆలస్యం.. నథింగ్ ఫోన్ 3a లైట్ యొక్క ధర, ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం పదండి.

రెండు కలర్ ఆప్షన్లు:

నథింగ్ ఫోన్ 3a లైట్.. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి రానుంది. ఈ ఫోన్లు గ్లోబల్ ఎడిషన్ కలర్ ప్యాలెట్‌కు సపోర్టుతో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో నథింగ్ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ గ్లిఫ్ LED ఇంటర్‌ఫేస్ కలిగి ఉన్నాయి.

భారత మార్కెట్లో ధర తగ్గొచ్చు:

Advertisement

నథింగ్ సంస్థ ఇంకా భారతీయ మార్కెట్ ధరను వెల్లడించనప్పటికీ.. 128GB వేరియంట్ గ్లోబల్ ధర సుమారు రూ.25,600 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. 256GB మోడల్ కోసం సుమారు రూ.28,700 వరకు ఉంటుంది. భారత మార్కెట్లో ధర రూ.24వేలు నుంచి రూ.28వేల మధ్య తగ్గే అవకాశం ఉంటుంది.

Read Also: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. అమెజాన్‌లో ఒప్పో రెనో 5Gఫోన్‌పై రూ.15వేలు తగ్గింపు!

గేమింగ్ & స్క్రోలింగ్‌కు వీలుగా:

Advertisement

మరి కొన్ని గంటల్లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న.. నథింగ్ ఫోన్ 3a లైట్ ప్రీమియం డిజైన్‌ కలిగి ఉంటుంది. 6.77-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లేతో 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానుంది. ఇది దాదాపు బెజెల్-లెస్ డిస్‌ప్లే, డివైజ్ ప్రీమియంగా కనిపించేలా ఉంటుంది. దీంతోపాటు ఎక్కువ సేపు గేమింగ్, రీల్స్ స్క్రోలింగ్‌కు సపోర్ట్ చేసేలా ఉంటుంది.

మల్టీ టాస్కింగ్ స్పెషాలిటీ:

ఈ నథింగ్ ఫోన్ 4nm ఫ్యాబ్రికేషన్ ప్రక్రియపై మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రో చిప్‌సెట్ కలిగి ఉంది. పవర్ పరంగా చూస్తే.. మల్టీ టాస్కింగ్‌ అందిస్తుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీని కలిగి ఉంది. అదనంగా 2TBకి సపోర్టుతో మైక్రో SD కార్డ్ స్లాట్, ప్లస్‌తో రానుంది. ఐకానిక్ గ్లిఫ్ లైట్ ఇంటర్‌ఫేస్ మెయిన్ హైలైట్‌లలో ఒకటి. LED-ఆధారిత నోటిఫికేషన్‌లు, ఛార్జింగ్ ఇండికేషన్లు, కస్టమైజడ్ రింగ్‌టోన్‌లతో వస్తోంది. అలాగే ఈ నథింగ్ ఫోన్ 3a లైట్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, డెప్త్ సెన్సార్ నథింగ్ ఫోన్ ఫ్రంట్ సైడ్ క్లీన్ హోల్-పంచ్ కటౌట్ లోపల 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌:

5,000mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. యూజర్లు ఇయర్‌బడ్‌లు లేదా ఏదైనా ఇతర అప్లియన్సెస్ హ్యాండ్‌సెట్ నుంచి నేరుగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్‌పరెన్స్ డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, స్ట్రాంగ్ బ్యాటరీ, కొత్త మీడియాటెక్ చిప్‌సెట్‌తో వస్తుంది.

Read Also: నాయిస్ క్యాన్సిలేషన్ AI ఇయర్ బడ్స్.. మీరు ఊహించనంత తక్కువ ధరకే వచ్చేస్తోంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×