E-Paper
Advertisement

Nothing Phone (2a) : తక్కువ ధరలోనే నథింగ్ ఫోన్ (2a).. లాంచ్ ఎప్పుడంటే..?

Nothing Phone (2a) : తక్కువ ధరలోనే నథింగ్ ఫోన్ (2a).. లాంచ్ ఎప్పుడంటే..?
Advertisement

Nothing Phone (2a) : ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ ఒక వ్యసనంలా మారిపోయింది. రోజంతా స్మార్ట్‌ఫోన్‌లోనే కొందరు కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ తరుణంలోనే రోజుకో కొత్త మొబైల్ మార్కెట్‌లోకి దర్శనమిస్తున్నాయి. వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు.. అప్డేటెడ్ వెర్షన్‌లతో సరికొత్త మోడళ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి.

అందులో నథింగ్ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన నథింగ్ ఫోన్ (1), నథింగ్ ఫోన్(2) స్మార్ట్‌ఫోన్లు విపరీతమైన రెస్పాన్స్‌ను అందుకున్నాయి.

Advertisement

తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఈ కంపెనీ తీసుకొస్తుంది. నథింగ్ ఫోన్ (2ఎ) పేరుతో దీనిని అందుబాటులో ఉంచనుంది. అయితే తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది.

READ MORE: ఒప్పో నుంచి మరో మిడ్‌రేంజ్ ఫోన్ లాంచ్.. ధర తక్కువ.. అదిరిపోయిన ఫీచర్లు..!

Advertisement

నథింగ్ ఫోన్ (2ఎ) స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 5న ప్రపంచ వ్యాప్తంగా లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఫోన్ ధర మాత్రం నథింగ్ ఫోన్ (1) కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే ఈ నెలాఖరులో జరగనున్న మొబైల్ వరల్డ్ కంగ్రెస్ 2024లో ఈ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

తాజాగా ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.30,000 కంటే తక్కువగానే ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ఇది 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుందని తెలిపాడు.

మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఉల్టా చిప్‌సెట్‌ప్‌ను కలిగి ఉందని అన్నాడు. అలాగే ఇది డ్యూయల్ రియర్ కెమెరాతో రానున్నట్లు పేర్కొన్నాడు. 50MP ప్రైమరీ, 50MP సెకండరీ సెన్సార్‌లు ఉండనున్నట్లు తెలిపారు. అలాగే ఫోన్ ముందుభాగంలో 32MP ఫ్రంట్ కెమెరాను అమర్చినట్లు పేర్కొన్నాడు.

READ MORE: డెడ్ చీప్ ధరలోనే Moto G04 5G స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే.?

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది రన్ అవుతుందని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. అయితే ఈ ఫోను అధికారికంగా లాంచ్ చేసిన తర్వాతే దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఓ క్లారిటీ రానుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×