E-Paper
Advertisement

అద్భుతమైన కలర్స్‌లో కేక పుట్టిస్తున్న నథింగ్ ఇయర్‌ఫోన్స్.. ఆ రెండు ఫీచర్లు నెక్ట్స్ లెవెల్ అంతే!

అద్భుతమైన కలర్స్‌లో కేక పుట్టిస్తున్న నథింగ్ ఇయర్‌ఫోన్స్.. ఆ రెండు ఫీచర్లు నెక్ట్స్ లెవెల్ అంతే!
Advertisement

Nothing Ear 3a: నథింగ్ కంపెనీ నుంచి రాబోతున్న సరికొత్త ఇయర్‌ఫోన్స్ ‘నథింగ్ ఇయర్ 3a’ డిజైన్, ఫీచర్లు అధికారిక లాంచ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. త్వరలో జరగబోయే ఒక గ్రాండ్ ఈవెంట్‌లో నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ఇయర్‌ఫోన్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమైంది. అయితే.. అంతకంటే ముందే వీటికి సంబంధించిన ప్రమోషనల్ ఇమేజెస్ బయటకు వచ్చి టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో..

విన్‌ఫ్యూచర్ వెబ్‌సైట్ షేర్ చేసిన లీక్స్ ప్రకారం.. ఈ కొత్త ఇయర్‌ఫోన్స్ నథింగ్ మార్క్ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ (పారదర్శక) డిజైన్‌తో రానున్నాయి. ఈసారి వీటిని కేవలం బ్లాక్ అండ్ వైట్ రంగులకే పరిమితం చేయకుండా.. ఎల్లో, పింక్ కలర్ ఆప్షన్లలో కూడా తీసుకురాబోతున్నారు. చెవుల్లో సరిగ్గా ఫిట్ అవ్వడం కోసం మార్చుకునే వీలున్న సిలికాన్ ఇయర్ టిప్స్‌తో ఈ ఇన్-ఇయర్ డిజైన్ ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి.

Advertisement

Also Read: AC vs Cooler: వానా కాలంలో ఏది వాడితే కరెంట్ బిల్లు తగ్గుతుంది? కంఫర్ట్‌గా ఉంటుంది?

హై-క్వాలిటీ ఆడియో ఎక్స్‌పీరియన్స్:

ఈ ఇయర్‌ఫోన్స్‌లో మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం 12mm డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎల్‌డీఏసీ (LDAC), హై-రెజ్ ఆడియో వైర్‌లెస్ సపోర్ట్ కూడా ఉండనుంది. దీనివల్ల బ్లూటూత్ ద్వారా పాటలు వినేటప్పుడు ఆడియో క్వాలిటీ అస్సలు తగ్గకుండా, ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది.

స్పెషల్ టచ్ ఫీచర్స్:

Advertisement

ఈ ఇయర్‌ఫోన్స్ స్టెమ్ (కింది భాగం) పై టచ్ సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. వినియోగదారులు దీనిపై టచ్ చేయడం ద్వారా కాల్ రికార్డింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఒక సరికొత్త ‘ఆడియో స్నాప్‌షాట్’ ఫీచర్‌ను కూడా ఇందులో ఇస్తున్నారు. దీని ద్వారా అవసరమైనప్పుడు చిన్న చిన్న ఆడియో క్లిప్స్‌ను చాలా ఈజీగా రికార్డ్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?

ఫీచర్లు అన్నీ ప్రీమియం రేంజ్‌లో ఉన్నప్పటికీ.. దీని ధరను మాత్రం కాస్త అందుబాటులోనే ఉంచేలా నథింగ్ ప్లాన్ చేస్తోంది. యూరప్ మార్కెట్లో సుమారు రూ.10,000 లోపు ఈ ఇయర్‌ఫోన్స్ లభించే ఛాన్స్ ఉంది. త్వరలో జరగబోయే ఈవెంట్‌లో దీని గురించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

Also Read: స్మార్ట్ టీవీల్లో ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలిస్తే.. ఇకపై సినిమా చూసే స్టైలే మారిపోతుంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×