E-Paper
Advertisement

యంగ్ జనరేషన్‌ కోసం Nothing సర్‌ప్రైజ్.. క్రేజీ కలర్‌లో కొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

యంగ్ జనరేషన్‌ కోసం Nothing సర్‌ప్రైజ్.. క్రేజీ కలర్‌లో కొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

Nothing Ear 3a: బడ్జెట్ ధరలో మంచి బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ కావాలనుకుంటున్న వారి కోసం ప్రముఖ టెక్ సంస్థ నథింగ్ నుంచి త్వరలోనే మార్కెట్లోకి Nothing Ear 3a అనే సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ లాంచ్ కానున్నాయని లీకుల ద్వారా తెలుస్తోంది. కంపెనీ అధికారికంగా ప్రకటించక ముందే.. ఈ బడ్స్ ధర, రంగులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పాత ధరలోనే కొత్త ఫీచర్లు:

గతంలో వచ్చిన నథింగ్ ఇయర్ (ఏ) మోడల్ లాగే, ఈ కొత్త ఇయర్ 3ఏ కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఫ్రాన్స్ మార్కెట్లో దీని ధర సుమారు రూ.10,900 ఉండవచ్చని తెలుస్తోంది. మనదేశంలో గత మోడల్ రూ.7,999కి లాంచ్ అయింది కాబట్టి.. ప్రస్తుత పోటీని తట్టుకోవడానికి ఈ కొత్త బడ్స్ ధరను కూడా పాత ధర పరిధిలోనే ఉంచే అవకాశం ఉంది.

ఆకట్టుకునే సరికొత్త పింక్ కలర్:

Advertisement

సాధారణంగా నథింగ్ ప్రొడక్ట్స్ అంటే బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఎక్కువగా గుర్తుకొస్తాయి. అయితే ఈసారి కంపెనీ యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవడానికి ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ ఇయర్ 3ఏ మోడల్ బ్లాక్, వైట్, ఎల్లో రంగులతో పాటు సరికొత్త పింక్ కలర్ ఆప్షన్‌లో కూడా రాబోతున్నట్లు సమాచారం. స్టైలిష్‌గా, కాస్త భిన్నంగా కనిపించాలనుకునే వారికి ఈ పింక్ వేరియంట్ మంచి ఛాయిస్ కానుంది.

Also Read: Lenovo నుంచి భారత్‌లోనే తయారైన సరికొత్త AI Laptop లాంచ్.. ప్రైస్ ఎంతంటే?

అప్‌గ్రేడెడ్ ఫీచర్ల అంచనా:

Advertisement

ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్లపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, లీకుల ప్రకారం ఇందులో మునుపటి కంటే మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీ ఉండనుంది. దీంతోపాటు ఆడియో క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ ఫీచర్లను కూడా మరింత అప్‌గ్రేడ్ చేయనున్నారు. అంతేకాదు.. ఈ బడ్జెట్ సిరీస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని టాక్.

త్వరలోనే గ్రాండ్ లాంచ్:

ఈ ఇయర్ 3ఏ బడ్స్ ఇటీవల ఇండోనేషియా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో, వీటి లాంచ్ చాలా దగ్గరలోనే ఉందని స్పష్టమవుతోంది. వీటితో పాటే ‘సీఎమ్‌ఎఫ్ బడ్స్ నియో’ అనే మరో ఆడియో ప్రొడక్ట్ కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మంచి లుక్స్, లేటెస్ట్ ఫీచర్లు, రీజనబుల్ ప్రైస్‌లో సరికొత్త ఇయర్‌బడ్స్ కోసం చూసేవారికి నథింగ్ ఇయర్ 3ఏ ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.

Also Read: సింగిల్ ఛార్జ్‌తో మూడ్రోజులు నాన్‌స్టాఫ్‌గా వాడొచ్చు.. moto g37 POWER ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×