E-Paper
Advertisement

క్రేజీ ఇయర్‌బడ్స్! కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో.. Nothing Ear (3a) లాంచ్

క్రేజీ ఇయర్‌బడ్స్! కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో.. Nothing Ear (3a) లాంచ్
Advertisement

Nothing Ear 3a Earbuds: ట్రెండీ గ్యాడ్జెట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ‘Nothing’ బ్రాండ్ నుంచి మరో క్రేజీ ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. సరి కొత్త ఫీచర్లతో Nothing Ear (3a) లాంచ్ అయింది. కేవలం రూ.9,490 ధరలోనే 45dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, సరికొత్త ‘Audio Snapshot’ టెక్నాలజీ, మోస్ట్ అవేటెడ్ ‘కాల్ రికార్డింగ్’ సపోర్ట్‌తో మార్కెట్ లో ఈ బడ్స్ దుమ్మురేపుతున్నాయి. ఈ లేటెస్ట్ నథింగ్ ఇయర్‌బడ్స్ ఫుల్ రివ్యూ , ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Nothing Ear 3a ఇయర్ బడ్స్ ఫూర్తి ఫీచర్లు:

డిజైన్ పరంగా ఎప్పుడూ డిఫరెంట్‌గా ఆలోచించే నథింగ్ బ్రాండ్, ఈసారి ఫీచర్ల పరంగా కూడా యూత్‌కు మైండ్ బ్లాక్ చేసే అప్‌డేట్స్ ఇచ్చింది. రూ.9,490 ప్రైస్ ట్యాగ్‌తో వస్తున్నఈ ఇయర్‌బడ్స్, మార్కెట్లో ఉన్న ప్రీమియం ఇయర్‌బడ్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నాయి.

1.45dB ANC:

Advertisement

ట్రాఫిక్‌లో ఉన్నా, ఆఫీస్ మెట్రోలో ఉన్నా.. బయటి గోల అస్సలు వినపడకూడదు అనుకునే వాళ్ల కోసం ఇందులో 45dB Active Noise Cancellation (ANC) ఇచ్చారు. ఇది చుట్టు పక్కల ఉండే అనవసరమైన శబ్దాలను పర్ఫెక్ట్‌గా ఫిల్టర్ చేస్తుంది. దీని వల్ల మీరు వినే మ్యూజిక్ లేదా చూసే మూవీస్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

2.క్రేజీ ‘Audio Snapshot’ ఫీచర్:

ఈ ఇయర్‌ బడ్స్‌లో హైలైట్ ఫీచర్ ఏంటంటే.. ‘Audio Snapshot’. దీని ద్వారా మీరు వింటున్న ఆడియోలోని బెస్ట్ పార్ట్‌ను లేదా పోడ్‌ కాస్ట్‌లోని ముఖ్యమైన విషయాలను కేవలం ఒక సింగిల్ ట్యాప్‌తో స్నాప్‌షాట్ లాగా రికార్డ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఒక వినూత్నమైన ఫీచర్ ఇది.

3.ఇన్-బిల్ట్ కాల్ రికార్డింగ్ సపోర్ట్:

Advertisement

చాలా మంది ఫోన్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ కోసం రకరకాల యాప్స్ వాడుతుంటారు. కానీ నథింగ్ ఈసారి స్మార్ట్‌గా ఆలోచించి, ఈ ఇయర్‌బడ్స్ ద్వారానే డైరెక్ట్‌గా కాల్ రికార్డింగ్ చేసుకునే సపోర్ట్‌ను అందించింది. క్లియర్ వాయిస్ కాల్స్ కోసం ఇందులో హై-క్వాలిటీ మైక్స్ కూడా ఉన్నాయి.

4. బ్యాటరీ లైఫ్ & సిగ్నేచర్ డిజైన్:

నథింగ్ అనగానే మనకు గుర్తొచ్చే ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను ఈ మోడల్‌లోనూ కంటిన్యూ చేశారు. అందుకే కేస్, బడ్స్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియంగా ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు.

Also Read: ఈ స్పీకర్స్ ఇంట్లో ఉంటే.. థియేటర్‌కి వెళ్లాల్సిన పనే లేదు!

ప్లస్ పాయింట్స్:

ఫీచర్స్: కాల్ రికార్డింగ్ , ఆడియో స్నాప్‌షాట్ అల్టిమేట్ ఫీచర్స్.

ANC: 45dB నోయిస్ క్యాన్సిలేషన్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.

లుక్: ఎప్పటిలాగే నథింగ్ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ అదిరిపోయింది.

మైనస్ పాయింట్స్:

రూ.9,490 ధర అనేది కొంచెం ఎక్కువే అనిపించినా, ప్రీమియం ఫీచర్ల కోసం ఈ బడ్జెట్ ఓకే.

మీరు రూ.10వేల లోపు బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, పవర్‌ఫుల్ ANC, సరికొత్త స్మార్ట్ ఫీచర్లు ఉన్న ప్రీమియం ఇయర్‌బడ్స్ కోసం చూస్తుంటే Nothing Ear (3a) బెస్ట్ ఛాయిస్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×